వినియోగదారుల చట్టం 2019 పై అవగాహన అవసరం అంటున్న సూర్యనారాయణమూర్తి


కాకినాడ జిల్లా , సామాజిక స్పందన

 కాకినాడ జిల్లా , పెద్దాపురం డివిజన్ కట్టమూరు జిల్లాపరిషత్ హై స్కూల్ నందు నిర్వహించిన సమావేశంలో 8,9,10, విద్యార్థులకు వినియోగదారుల చట్టం 2019 పై  అవగాహన కార్యక్రమం నిర్వహించిన పెద్దాపురం వినియోగదారుల సంఘ ప్రెసిడెంట్ బి సూర్యనారాయణ మూర్తి .

ఈ అవగాహన కార్యక్రమంలో సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ వస్తువులు కొన్నపుడు  బిల్లు తీసుకోవాలని సూచించారు, అంతేకాకుండా ఏలెట్రికల్, ఎలాట్రానిక్స్ వస్తువులు కొన్నపుడు ఐ స్ ఐ ముద్ర ఉన్నావె కొనాలని ఆయన అన్నారు. అదేవిధంగా గ్యాస్ డెలివరీ బోయ్ కి ఐదు కిలో మీటర్లు లోపల వున్నవారు అదనంగా డబ్బులు ఇవ్వవద్దని 5 దాటితే 15వరకు 20 /- 15 దాటితే 30 /- చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని తెలియజేశారు., అంతేకాకుండా మెడిసిన్స్ కొన్నపుడు ఎక్సపైరి డేట్ చూచి కొనమని విద్యార్థులకు చెప్పారు. అంతేకాకుండా ధియేటర్స్ లొ పార్కింగ్ ఫీజ్ ఇవ్వవద్దని, బంగారు వస్తువులు కొన్నపుడు హాల్ మార్క్ చూచి కొనాలని సూచించారు, ఈ కార్యక్రమంలో స్కూల్ స్టాప్ నంబర్స్ మరియు విద్యార్థులు తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు. 


      @@@@@@ మరిన్ని వార్తలు @@@@@@



2024లో తెదేపా, జనసేన అఖండ విజయం ఖాయం అంటున్న భువనేశ్వరి.


శ్రీకాళహస్తి, సామాజిక స్పందన

 వైకాపా వాళ్లది ధన బలమైతే.. తెలుగుదేశం పార్టీది ప్రజా బలమని నారా భువనేశ్వరి అన్నారు. 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో తెదేపా-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు..

'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగమే మన దేశాన్ని నడిపిస్తోందన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు మంచివారైతేనే ప్రజలకు మేలు జరుగుతుందని, చెడ్డవారైతే ప్రజలకు కీడు జరుగుతుందని అంబేడ్కర్‌ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ఏపీ అంటే ఇప్పుడు .. కమీషన్‌ కోసం కంపెనీలను బెదరగొట్టడం, కరెంటు బిల్లుల గురించి అడిగితే కేసులు పెట్టడం, నిత్యావసరాల ధరలు అధికంగా ఉన్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రంగా మారిందని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ''ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం తీసుకొస్తే.. చంద్రబాబు ఆత్మవిశ్వాసం తెచ్చారు. అలాంటి వ్యక్తిని 49 రోజులుగా జైల్లో పెట్టారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం తప్పా, అమరావతి రాజధాని నిర్మించడం తప్పా, పోలవరం కట్టడం తప్పా. ఆయన చేసిన నేరం ఏమిటి?'' అని భువనేశ్వరి ప్రశ్నించారు..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.