అమరావతి, సామాజిక స్పందన
ఈ రోజు కేబినెట్ సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న కేబినెట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం కానుంది కేబినెట్..
Deal of the day: OnePlus 11R 5G (Galactic Silver, 16GB RAM, 256GB Storage) https://amzn.eu/d/aQ8Mnay
పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గ సమావేశం.. సుమారు 19 వేల కోట్ల రూపాయాల విలువైన పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.. విశాఖలో ట్రాన్సిట్ అకామిడేషన్ కమిటీ నివేదికపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ కల్యాణ మస్తు – షాది తోఫా మూడో విడత, జగనన్న విద్యా దీవెన మూడో విడతకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఖాళీల భర్తీ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటన, బాధితులకు ప్రభుత్వ పరిహారం, జగనన్న ఆరోగ్య సురక్షా తదితర అంశాల పై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..
విశాఖ నుంచి పాలన దిశగా వైఎస్ జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తుంది. విశాఖలో పరిపాలన భవనాల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ భవనాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు కోసం గుర్తించిన వివిధ భవనాల వివరాలను అధికారుల కమిటీ సీఎం వైఎస్ జగన్‌కి వివరించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం పర్యవేక్షణ, సమీక్ష సమావేశాల నిర్వహణకు విశాఖలో క్యాంపు కార్యాలయం చూస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో గుర్తించిన భవనాల వివరాలను సీఎం వైఎస్ జగన్‌కు కమిటీ వివరించింది. రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు సహా, ఇతర అధికారులు తమ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన భవనాలను కూడా గుర్తించినట్లు పేర్కొంది.. విశాఖలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాలు, వాటి కార్యాలయాలు 2,27,287 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని కమిటీ సీఎంకు వివరించింది..
@@@@@@@ మరిన్ని వార్తలు@@@@@@@
కాంగ్రెస్ రెండో విడత విజయభేరీ బస్సు యాత్ర
తెలంగాణ, మెదక్ జిల్లా, సామాజిక స్పందన
తెలంగాణలో రెండో విడత కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్ర ఆదివారం మెదక్ పార్లమెంట్ పరిధిలో జరగనుంది. ఈ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు హాజరు కానున్నారు..
మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డిలోని గంజ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. నర్సాపూర్‌లో 4 గంటలకు కార్నర్‌లో జరగనున్న మీటింగ్‌లో పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే ఆదివారం సాయంత్రం 6 గంటలకు మెదక్‌లో జరిగే సభకు మల్లికార్జున ఖర్గే హాజరవుతారు..
తెలంగాణలో రెండో విడత కాంగ్రెస్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం నుంచి నవంబర్ 1వ తేదీ వరకు రెండో విడత బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాల్గొననున్నారు. ఈరోజు బస్సు యాత్రలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాల్గొననున్నారు. 30, 31 తేదీల్లో ప్రియాంక గాంధీ.. వచ్చే నెల 1న బస్సుయాత్రలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బస్సు యాత్ర సాగేలా తెలంగాణ పీసీసీ ప్లాన్ చేసింది. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో రెండో విడత బస్సు యాత్ర సాగనుంది..












0 Comments