కుత్బుల్లాపూర్, సుభాష్ నగర్, సామాజిక స్పందన
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సుభాష్ నగర్ లోని క్షత్రియ సేవా సమితి ప్రెసిడెంట్ పి శ్రీనివాసరాజు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సుభాష్ నగర్ లాస్ట్ బస్ స్టాప్ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ శ్రీనివాసు రాజు టిఆర్ఎస్ పార్టీలో చేరడం పై హర్షం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు సుభాష్ నగర్ పరిధిలో ఉన్న పలువురు క్షత్రియ నాయకులను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్పించడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మంచి నాయకుడిగా సేవలు అందించిన శ్రీనివాస రాజు గారిని ఈ సందర్భంగా అభినందించారు. అంతేకాకుండా క్షత్రియ సేవా సంగం తరపున ఆయన చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నలు, పొందిన శ్రీనివాసరాజు కి సుభాష్ నగర్ లో మంచి ప్రజాదరణ ఉంది. అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కే పి వివేక్ ని గెలుపొందించే కార్యక్రమాలు చేయాలని స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా గత తొమ్మిది సంవత్సరాలు గా ఎమ్మెల్యే వివేక్ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరొకసారి తెలియజేశారు. మరొకసారి ఎమ్మెల్యే గా గెలిచి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని వివేక్ ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో 130 డివిజన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, శ్రీనివాసరాజు మరియు స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు సమక్షంలో ఏ కిషోర్ రాజు, వి శ్రీనివాసరాజు వి బాలరాజు ఎస్ వాసురాజు పి శ్రీనివాసరాజు, వెంకటపతి రాజు ఐ రమేష్ రాజు మురళీకృష్ణంరాజు, పి శివరామరాజు ఎన్ శ్రీనివాసరాజు , పి సుబ్రహ్మణ్యం రాజు, వి సుబ్బరాజు ఎన్ నాగరాజు ఐ. రాజశేఖర్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..










0 Comments