తెలంగాణ, సామాజిక స్పందన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి కీలకఘట్టం ప్రారంభంకానుంది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలు కానుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి చేసి..
ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు ఆశావహులు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 119 నియోజకవర్గాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 10 వరకు అభ్యర్థులు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈనెల 13న నామినేషన్ల పరిశీలన చేయనుండగా.. ఈనెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీగా నిర్ణయించారు. ఈ నెల 30న పోలింగ్ నిర్వహించి.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపడతారు..










0 Comments