రాజమహేంద్రవరం, సామాజిక స్పందన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆయనకు చల్లటి వాతావరణం అవసరమేనని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేశారు..
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోన్న నేపథ్యంలో శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం జైలు ఆవరణలో.. చంద్రబాబుకు చికిత్స అందిస్తున్న వైద్యులతో కలిసి జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు మాట్లాడుతూ.. ''చంద్రబాబు వేసుకునే మందులు మాకు చూపించారు. అవి చూసిన తర్వాతే మిగతా మందులు సూచించాం. చంద్రబాబును చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని జైలు అధికారులకు ఇప్పటికే సూచించాం. చల్లని వాతావరణం లేకపోతే మేము ఇచ్చిన మందులు ఎంతవరకు పని చేస్తాయో తెలియదు. ఆయనకు ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదు. గతంలో ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమిటో మాకు తెలియదు'' ప్రభుత్వ వైద్యులు వివరించారు..










0 Comments