అమరావతి, సామాజిక స్పందన
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగానికి సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, పలు ప్రాజెక్టుల పనులకు వర్చువల్ పద్ధతిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు..
12 సబ్‌స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తున్నాం, 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ట్రాన్స్‌మిషన్ కెపాసిటీని విస్తరించుకుంటూ, నాణ్యమైన విద్యుత్ ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు ఇచ్చే వ్యవస్థను క్రియేట్ చేస్తున్నామన్నారు. రైతులకు 9 గంటలపాటు పగటిపూటే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టామన్నారు. రూ.1700 కోట్ల తో ఫీడర్లను ఏర్పాటుచేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నామని తెలిపారు. ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి రూ.2.4లకే యూనిట్ ధరతో సెకీతో ఒప్పందం చేసుకున్నామన్నారు. మరో 25 సంవత్సరాలపాటు రైతులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు. ఇప్పుడు సగటున రూ.2.4కే యూనిట్ ధర వచ్చే పరిస్థితుల్లోకి అడుగులు వేస్తున్నామన్నారు. దాదాపు రూ.3099 కోట్లతో సబ్‌స్టేషన్ల కోసం ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే కొన్నింటిని ప్రారంభించామని, మరి కొన్నింటి పనులు ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు..










0 Comments