విలేకరు దగ్గర ఆధారాలు ఉన్న తప్పుడు కేసులు పెడుతున్న జగ్గంపేట పోలీసులు

  


కాకినాడ / జగ్గంపేట /నవంబర్ 23/, సామాజిక స్పందన

చట్టాన్ని కాపాడవలసిన పోలీసులే ఇష్టం లేని వారి పై తప్పుడు కేసులు పెడుతున్నారు.కాకినాడ జిల్లా జగ్గంపేట ఎస్సై నాగార్జున రాజు తనకు ఇష్టం లేని విలేకరుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు.

వివరాల లోకి వెలితే కాకినాడ జిల్లా జగ్గంపేట మరియు పరిసర ప్రాంతాలలో వున్న ఇష్టం లేని విలేకర్ల పై తప్పుడు కేసులు పెడుతున్న నిజ నిజాలు తెలుసుకోకుండా ఇష్టం లేని వారిపై కక్ష సాధింపు చర్యలుగా కొన్ని తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అవినీతే మా మార్గం, అన్యాయం, అక్రమాలే మా ద్వేయం నీతి నిజాయితీ వైపు నిలబడే ప్రజలు మరియు మీడియా ప్రతినిధులే మా శత్రువులు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.చాలా నియమ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా  వ్యవహరిస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో గతంలో రామవరం హైవే మీద ముగ్గురు విలేకరులు అటుగా జగ్గంపేట వైపు వెళ్తున్న మార్గం లో అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం చూసి గమనించి అందులో శివాజీ అనే విలేకరు జగ్గంపేట ఎంఆర్ఓ వీఆర్వో   కు ఫోన్ చేసి వివరాలు చెప్పగా జగ్గంపేట సిఐ  వెహికల్ వద్దకు వచ్చి జగ్గంపేట పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది . అయితే కొంతమంది విలేకర్ల యూనియన్  పేరు చెప్పుకుంటూ పోలీస్ స్టేషన్ మ రియు అధికారాలు దగ్గర దండుకుంటున్న వాళ్ళని వదిలేసి నిజాయితీగా వార్తలు రాసిన వారి మీద జగ్గంపేట పోలీసు వారు కేసులు పెడుతున్నారు. గతంలో జగ్గంపేట సెంటర్లో ట్రాఫిక్ మీద కథనం వార్తాపత్రిక రాశారు. అని ఆ విలేఖరి మీద తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం. రేషన్ బియ్యం ప్రజా సంక్షేమం మరియు ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ అధికారుల పర్మిషన్ తో తరలించడం తప్పుకాదు కానీ నిజాయితీ విలేకరి పట్టిస్తే  కేసు పెట్టమని జీవో ఏమైనా ఉందా అని గతంలో ఎస్పీ కి సమాచార హక్కు ద్వారా స్పందన డిపార్ట్మెంట్ వారికి లెటర్ ఇవ్వడం జరిగింది.              

గతంలో రామవరం గ్రామ పరిసర ప్రాంతాలలో వ్యభిచారం జరుగుతుంది అని హోటల్ వెనకాల ఆయిల్ మాఫియా జరుగుతుందని తీర భూమి పత్రికలో ఉద్యమ కెరటం పత్రికలో కథనాలు వచ్చాయని అవి దృష్టిలో పెట్టుకుని కేసు పెడుతున్నారు.

జగ్గంపేటలో విలేకరి గ్రూపుకి ఒక నాయకుడు ఉన్నాడు అతను ఏమి చెపితే న్యాయం, అన్యాయం విచారించకుండా పోలీసులు విలేకరుల మీద అతను నచ్చకపోతే అప్పుడు కేసులు పెట్టిస్తూ ఉంటాడు అలా బలైపోయినా విలేకరులు జగ్గంపేటలో చాలామంది ఉన్నారు. అంతేకాకుండా నిజాయితీగా రాసిన వార్తలు వారికి దండుకోవడానికి కుదరదు కాబట్టి తప్పుడు  కేసులు పెట్టీ దాడులకు పాల్పడుతున్నారు.     జగ్గంపేటలో కోడిపందాలు, పేకాట, గుండాట్లో,ఆయిల్ మాఫియా, గుట్కా వాటి మీద దృష్టి పెట్టకండి పోలీసు వారు నచ్చని విలేకరుల పై కేసు పెట్టడం ఇది ఎంతవరకు న్యాయమని జనం మరియు ప్రజాలు భావిస్తున్నారు. అంతేకాకుండా విలేకరుల మీద తప్పుడు కేసులు పెట్టొద్దని సుప్రీంకోర్టు గైడెన్స్ ఉన్నా జగ్గంపేట పోలీసువారికి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అని పత్రికా విలేకరులు ఆందోళన చెందుతున్నారు.


  @@@@@ మరిన్ని వార్తలు చదవండి @@@@@


రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: ఏపీ సీఎం జగన్


శ్రీసత్యసాయి జిల్లా, సామాజిక స్పందన 

 రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి  అన్నారు. మంగళవారం పుట్టపర్తిలో వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.

53 నెలల్లో గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం హయాంలో జరగని విధంగా చూడని విధంగా రైతులకు పెట్టుబడి సాయం చేశామన్నారు. వైయస్సార్ రైతు భరోసా ద్వారా ప్రతి యేటా 53 లక్షల మంది రైతులకు 13500 ఇచ్చామని చెప్పారు. పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం ఇదే అని అన్నారు. పంటల భీమాకు ప్రీమియం చెల్లిస్తూ రైతన్నలకు తోడుగా ఉంటున్నామన్నారు..

దేవుడు దయతో ఐదు సంవత్సరాలు ఎక్కడా కరువు లేదన్నారు. చంద్రబాబు హయాంలో ఐదు సంవత్సరాలు కరువే కరువు అంటూ వ్యాఖ్యలు చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి గతంలో చంద్రబాబు ఏమీ చేయలేదన్నారు. ''కరువు రావడం రాకపోవడం మన చేతుల్లో ఉండదు... ఆదుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది'' అని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాప్ ద్వారా ప్రత్యేక ఎకరా నమోదు చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.