తెలంగాణ, ఆదిలాబాద్, సామాజిక స్పందన
తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని టీపీసీసీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు..
చివరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దేశాన్ని వదిలి పారిపోతారని అన్నారు. వీళ్లను గెలిపిస్తే ఆలి మీద తాళిని కూడా లాక్కుపోతారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 'దొరల తెలంగాణ కావాలా.. ప్రజా తెలంగాణ కావాలా?' తేల్చుకోవాలని ఓటర్లను ఉద్దేశించి అన్నారు. దోచుకోమంటూ పిల్ల రాక్షసులను ప్రజల్లోకి వదిలాడని కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. పిల్ల రాక్షసులకు బ్రహ్మ రాక్షసుడు కేసీఆర్ ధ్వజమెత్తారు. జోగు రామన్న ఆదిలాబాద్‌ను దోచుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆదిలాబాద్‌లో నిర్వహించిన 'కాంగ్రెస్ విజయభేరి యాత్ర'లో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
బీజేపీకి ఓటేస్తే.. బీఆర్ఎస్‌కు ఓటేసినట్లే.
బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్టేనని రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్వహించిన సభలో కాళేశ్వరం గురించి మోదీ ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. మేడిగడ్డకు మోదీ ఎందుకు పోలేదని, మేడిగడ్డ గురించి మాట్లాడడు కానీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై మోదీ మాట్లాడుతారని మండిపడ్డారు. కడెం, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ కాదా? అని అన్నారు. ఇక పార్టీలో ఆశావహులు ఎందరు ఉన్నా ఒక్కరికే టికెట్ ఇవ్వగలమని, టికెట్ రాని వారిని కాంగ్రెస్ కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధిహామీ కూలీలకు రూ.12 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు..










0 Comments