గోదావరి జిల్లా, సామాజిక స్పందన
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన మహేంద్ర ఆత్మహత్య ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించనున్నట్లు హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు..
ఈ ఘటనక తనకు ఎటువంటి సంబంధం లేదని, కావాలనే తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మహేంద్ర ఆసుపత్రిలో జాయిన్ అయిన దగ్గర్నుంచి వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని డాక్టర్లకి సూచించానని అన్నారు..
కొవ్వూరులో హోంమంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి సీఐడీ ఎంక్వయిరీ వేయమని కోరినట్లు తెలిపారు. సీఐడీ ఎంక్వయిరీకి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ ఎంక్వైరీలో మహేంద్ర మృతి వెనక నిజ నిజాలు నిగ్గు తేలతాయని అన్నారు. జనసేన పార్టీకి చెందిన నాయకులు దురుద్దేశంతో ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు..
########## మరిన్ని వార్తలు చదవండి##########
సీఎం జగన్‌ను కలిసిన జర్నలిస్టులు.
తాడేపల్లి, సామాజిక స్పందన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్ జర్నలిస్టులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు..
జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్సార్ ఇళ్ల స్థలాలు ఇచ్చారని గుర్తుచేశారు. అప్పుడు ఇళ్ల స్థలాలు పొందిన జర్నలిస్టులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారన్నారు..
మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత మీ ప్రభుత్వం మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తోందన్నారు. దీనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముఖ్యమంత్రితో అన్నారు. కొందరికే కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టుకీ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లస్థలాలు ఇవ్వడం జర్నలిస్టులందరికీ సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ నిర్ణయం ద్వారా మేనిఫెస్టోలో ఉన్న హామీని నిలబెట్టుకున్నామని సీఎం జర్నలిస్టులతో అన్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న 99.5 శాతం హామీలను నెరవేర్చామన్నారు..
జర్నలిస్టుల ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియనుజర్నలిస్టుల ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయమని సీఎం అధికారులను అక్కడే ఆదేశించారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల విషయంలో ఎప్పటికప్పుడు పురోగతిని తనకు నివేదించాలన్నారు. జాప్యానికి తావులేకుండా, భూముల గుర్తింపు సహా తదితర అంశాలపై నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటుచేసుకుని ముందుకువెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
సీఎంని కలిసిన వారిలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు( జాతీయ మీడియా) దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజెఎఫ్ యూనియన్ నేతలు జి.ఆంజనేయలు, ఎస్.వెంకటరావు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీవీఆర్ కృష్ణంరాజు తదితరులు ఉన్నారు..











0 Comments