కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన
పెద్దాపురం ప్రాంతంలో ప్రజలపైన దాడి చేస్తున్న నల్లబూడిద నివారణకు మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక దృష్టి పెట్టాలని సిపిఎం పెద్దాపురం మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు ఒక ప్రకటన విడుదల చేసారు. శీతాకాలం వచ్చిందంటే పెద్దాపురం పట్టణంపై నల్లబూడిద దాడి పెరిగిపోయిందని అన్నారు. ప్రజల కళ్ళ సమస్యతో తీవ్ర అవస్దలు పడుతున్నారని తెలిపారు. పెద్దాపురం చుట్టుపక్కల ఉన్న ప్యాక్టరీల నుండి నల్లబూడిద.విపరీతంగా వెలువడుతుందని అన్నారు. పెద్దాపురం ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన మున్సిపాల్టి కనీసం పట్టనట్టు వ్యవహరిస్తుందని అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ప్రతి ఏడాది సీజనల్ గా ఈ సమస్య వస్తుందని కానీ దీని శాశ్వత పరిష్కారానికి ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. ఈ పాటికే కౌన్సిల్ తీర్మానం చేసి జిల్లా ఉన్నతాదికారులకు పంపాలని దానిని మీడియాకు విడుదల చేయాలని అన్నారు. కనీసం రోడ్డుపైన తిరగలేని పరిస్దితి ఏర్పడినా ప్రజాప్రతినిధులకు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. కళ్ళ హాస్పటల్ కి ప్రజలు క్యూ కడుతున్నారని అన్నారు. నల్లబూడిద సమస్య పరిష్కారానికి తక్షణం అఖిలపక్షం వేసి దాని ద్వారా ఉన్నత అధికారులు, ప్రభుత్వం స్పందించే విధంగా చేయాలని అన్నారు.
సమావేశంలో సిపిఎం నాయకులు సిరిపురపు శ్రీనివాస్, కేదారి నాగు పాల్హోన్నారు.










0 Comments