విజయవాడ దుర్గ గుడిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

.

విజయవాడ, సామాజిక స్పందన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను శనివారం ఉదయం దర్శించుకున్నారు..

చంద్రబాబు సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ ద్వారం వద్ద మేళతాళాలతో బాబు దంపతులకు వేదపండితులు స్వాగతం పలికారు.

దుర్గమ్మ దర్శనం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఎన్ని దుష్ట శక్తులనైనా ప్రతిఘటిస్తూ ముందుకెళ్తానన్నారు. తెలుగు ప్రజానీకానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజలు సిరిసంపదలతో ఆనందంగా జీవించేందుకు వారికి సేవ చేసే అవకాశం అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతున్నాన్నారు. కనకదుర్గమ్మ శక్తి స్వరూపిణి అని.. సమాజాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించమని అమ్మవారిని ప్రార్ధించానని చెప్పారు. మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరమనే తొలుత దైవదర్శనాలు చేస్తున్నానన్నారు. తనకు కష్టం వచ్చినప్పుడు న్యాయం కోసం, ధర్మం కోసం దేశ విదేశాల్లో పోరాటాలు చేశారన్నారు. అధికార యంత్రాంగం తమ ధర్మాన్ని నిర్వర్తించాలని చంద్రబాబు సూచించారు..

దుర్గమ్మ ఆలాయినికి వచ్చిన చంద్రబాబుకు కేశినేని నాని,జనసేన నేత పోతిన మహేష్, పంచుమర్తి అనురాధ, అశోక్ బాబు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, బోండా ఉమా, మాగంటి బాబు, బుద్దా వెంకన్న తదితరులు స్వాగతం పలికారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.