పార్లమెంటు ఘటనపై 8 మంది భద్రత సిబ్బంది సస్పెండ్.

 


న్యూఢిల్లీ , సామాజిక స్పందన

దేశ అత్యున్నత ప్రజా స్వామ్య వేదిక అయిన పార్లమెంటులో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంత్రులు ప్రహ్లాద్‌ జోషీ అనురాగ్‌ ఠాకూర్‌ పీయూష్‌ గోయల్‌ తది తరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సమా వేశానికి హాజరయ్యారు. ఈ స‌మావేశంలో పార్ల‌మెంట్ భ‌ద్ర‌త‌పై ప‌లునిర్ణ‌యాలు తీసుకున్నారు.

ఎనిమిది మంది సిబ్బందిపై వేటు! 


మరోవైపు భద్రతా వైఫ ల్యంపై లోక్‌సభ సెక్రటేరి యట్‌ చర్యలు చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్‌ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్ల డించాయి.


పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన.


లోక్‌సభలో బుధవారం చోటుచేసుకున్న ఘటనపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో విపక్షాలు గురువారం ఆందోళన చేపట్టాయి ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే భద్రతా వైఫల్యంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు.


వారి ఆందోళనల మధ్య సభ కొంతసేపు సాగింది అయితే విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినా దాలు చేయడంతో స్పీకర్‌ వారిని వారించారు.


అయినప్పటికీ వారు వెనక్కి తగ్గక పోవడంతో సభ మధ్యాహ్నం కు వాయిదా పడింది అటు రాజ్య సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.


భద్రతా వైఫల్యంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఛైర్మన్‌ సభను మధ్యా హ్నానికి వాయిదా వేశారు

తాజా ఘటన నేపథ్యంలో పార్లమెంట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పార్లమెంట్‌ భవనంలోకి ప్రవేశాలపై ఆంక్షలు విధించారు.


ఎంపీలు ప్రవేశించే మకర ద్వారం నుంచి ఇతరులు వెళ్లకుండా నిషేధం విధించారు మీడియాపైనా ఆంక్షలు కొనసాగు తున్నాయి ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వ హించి మీడియా వ్యక్తులకు పాసులు జారీ చేస్తున్నారు వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.


ఇక పార్లమెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి బూట్లను కూడా నేడు స్కాన్‌ చేస్తున్నారు ప్రస్తుత పార్లమెంటు సమా వేశాలు ముగిసే వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగు తాయని అధికారులు వెల్లడించారు.

    @@@@@ మరిన్ని వార్తలు చదవండి@@@@@@


సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్‌ విక్రయాలు, హైదరాబాద్‌లో ముఠా అరెస్టు.

హైదరాబాద్, సామాజిక స్పందన

సూరారంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. సూరారం పోలీసులతో పాటు సంయుక్త ఆపరేషన్ చేసి ముఠా సభ్యులను పట్టుకున్నట్లు యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఎస్పీ గుమ్మి చక్రవర్తి తెలిపారు..

ఈ దాడిలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముగ్గురు నిందితులు, వారి నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 ఎంఎల్ లిక్విడ్ మెథాంఫెటమైన్ డ్రగ్‌ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందన్నారు..

ఎస్పీ మాట్లాడుతూ.. ''డ్రగ్స్ తయారు చేస్తున్నవారిలో ప్రధాన నిందితుడు కె.శ్రీనివాస్‌గా గుర్తించాం. అతను ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నగరంలోని గాజుల రామారంలో నివాసం ఉంటున్నాడు. నిందితుడు శ్రీనివాస్‌కు డ్రగ్స్ తయారీపై అవగాహన ఉంది. 2013లో ఓ పరిశ్రమలో డ్రగ్స్ తయారు చేయగా.. నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు జైలుకు పంపారు. జైలు నుంచి బయటికి వచ్చాక నరసింహ రాజు, మణికంఠతో కలిసి సూరారంలో ఒక ఇంట్లో డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ ముగ్గురూ కలిసి గత రెండేళ్లుగా డ్రగ్స్ తయారు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. లిక్విడ్ మెథాంఫెటమైన్ తీసుకొని ప్రాసెస్ చేసి డ్రై చేస్తే క్రిస్టల్ మెథాంఫెటమైన్ డ్రగ్ తయారవుతుంది. అలా తయారు చేసిన మాదకద్రవ్యాలను వివిధ ప్రాంతాల్లో విక్రయించారు. సోషల్ మీడియా ద్వారా విక్రయాలు కొనసాగించారు'' అని ఎస్పీ వివరించారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులపై పీడియాక్ట్ నమోదుకు ప్రతిపాదన చేసినట్లు ఎస్పీ వెల్లడించారు..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.