ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి


హైదరాబాద్‌, సామాజిక స్పందన

అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి  వెల్లడించారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు..

ఆరోగ్యశ్రీ లోగో, పోస్టర్‌లను ఆవిష్కరించి, తెలంగాణ ప్రభుత్వం తరఫున బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్ల చెక్కును అందజేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయ్యాక అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, సీఎస్‌ శాంతికుమారి, ఆర్టీసీ  ఎండీ సజ్జనార్‌, అధికారులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. '' ఇవాళ తెలంగాణ ప్రజలకు పండగ రోజు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుంది. నాది తెలంగాణ అని చెప్పే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారు. ఇక్కడి ప్రజల కోసమే సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారు. ఇవాళ ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు'' అని తెలిపారు..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.