అంగ‌న్‌వాడీ సెంట‌ర్‌ల తాళాలు బ‌ద్ద‌లు కొట్టిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి అంటూ పోలీసు స్టేష‌న్‌లో కంప్లెట్ చేసిన అంగ‌న్‌వాడీలు.

 

  కాకినాడ జిల్లా , పెద్దాపురం , సామాజిక స్పందన

    ఎ.పి. అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్స్ అండ్ హెల్ప‌ర్స్ యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాపితంగా జ‌రుగుతున్న స‌మ్మె 4వ రోజుకు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా పెద్దాపురం మున్సిప‌ల్ సెంట‌ర్‌లో స‌మ్మె శిభిరాన్ని కొన‌సాగించారు. ఆంధ్ర‌రాష్ట్ర అవ‌త‌ర‌ణ కోసం ప్రాణంత్యాగం చేసిన పొట్టి శ్రీ‌రాములు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయన చిత్ర ప‌టానికి పూల‌మాల వేసి నివాళి అర్పించారు.

 అంగ‌న్‌వాడీ సెంట‌ర్ తాళాలు బ‌ద్ద‌లు కొట్టిన వారిపై త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఎప్‌.ఐ.ఆర్ న‌మోదు చేయాల‌ని పెద్దాపురం పోలీసు స్టేష‌న్‌లో పిర్యాదు చేసారు. సెంట‌ర్‌లు తాళాలు బ‌ద్ద‌లు కొట్టార‌ని సెంట‌ర్‌లో రికార్డులు గానీ, సామాన్లు గాని ఏమి పోయినా త‌మ‌కి సంబందం లేద‌ని, పూర్తి భాద్య‌త ఐసిడిఎస్ అధికారులే వ‌హించాల్సి ఉంటుందని అంగ‌న్‌వాడీ నాయకులు లేఖ‌ను అందించారు. 

    స‌మ్మె సంద‌ర్భంగా మున్సిప‌ల్ సెంట‌ర్‌లో ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసారు. దాడి బేబి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మ్మె శిభిరానికి అఖిల భార‌త ప్ర‌జాతంత్ర మ‌హిళా సంఘం రాష్ట్ర స‌హాయ కార్య‌ద‌ర్శి చెక్క‌ల ర‌మ‌ణి మ‌ద్ద‌తు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మ‌హిళలంటే చాలా చిన్న చూపుగా ఉంద‌ని అన్నారు. 4 రోజులుగా రోడ్డుపైన టెంట్‌లు వేసుకొని ఉంటున్నా ప్ర‌భుత్వం చాలా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అన్నారు. ఉన్న‌తాదికారులు మొత్తం వైసిపి కార్య‌క‌ర్త‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఇది చాలా దారుణ‌మైన విష‌య‌మ‌న్నారు. మున్సిప‌ల్ క‌మిష‌ర్ ద‌గ్గ‌రుండి మ‌రి అంగ‌న్‌వాడీ సెంట‌ర్ తాళాలు బ‌ద్ద‌లు కొట్టించ‌డం అంటే దానంత సిగ్గుచేటు మ‌రొక‌టి ఉండ‌ద‌న్నారు. త‌క్ష‌ణం అంగ‌న్‌వాడీ స‌మ‌స్య ప‌రిష్క‌రించాలని డిమాండ్ చేసారు. 


       కార్య‌క్ర‌మంలో సిఐటియు నాయ‌కులు డి.క్రాంతి కుమార్ అంగ్‌వాడీ యూనియ‌న్ నాయకులు నాగ‌మ‌ణి, అమ‌లా, వ‌ర‌ల‌క్ష్మీ, ఫాతిమా, ఎస్తేరు రాణి, వ‌ణ‌కుమారి, వ‌సంత‌, తుల‌సి, ప‌ద్మ‌, స్నేహ‌ల‌త‌, నెహ్రు కుమారి, కాలే దేవి, జె. సూర్య‌కుమారి, జ్యోతి, మాచ‌ర‌మ్మ‌, లోవ‌త‌ల్లి త‌దిత‌రులు పాల్గోన్నారు.


@@@@@@ మరిన్ని వార్తలు చదవండి @@@@@@

తుపాను బాధితులకు ప్రభుత్వం ₹25వేల ఆర్థిక సాయం అందించాలి: చంద్రబాబు డిమాండ్

బాపట్ల, సామాజిక స్పందన

 తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు  రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శనివారం జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో ఆయన పర్యటించారు..


తుపాను వల్ల సర్వం కోల్పోయామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా లేక నాలుగు రోజులు చీకట్లోనే గడిపామని కాలనీ వాసులు తమ బాధను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో రహదారి లేక రోజులు తరబడి బురదలోనే గడిపామని స్థానికులు వాపోయారు. ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని కాలనీ వాసులు ఆరోపించారు..


ఈ సందర్భంగా కాలనీ వాసులకు చంద్రబాబు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశారు. బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ''ఎస్టీ కాలనీలో ఎక్కడ చూసినా వరద నీరే. నాలుగు రోజులు మీరంతా నీళ్లలోనే ఉన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలోనే ఇంత దారుణ పరిస్థితులు ఉండటం దుర్మార్గం. తెదేపా (TDP) తరఫున ఒక్కో ఇంటికి ₹5వేల సాయం అందిస్తున్నాం. ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి ₹25వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలి. గత ఎన్నికల్లో తెదేపాకు ఓటు వేశారనే కాలనీ వాసులపై కక్షగట్టారు'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.