అల్లూరి జిల్లా, సామాజిక స్పందన
మావోయిస్టులు రేపు భారత్ బందుకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. దీంతో పోలీసులు తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు.
దండ కారణ్యాన్ని భద్రత బలగాలతో జల్లెడ పడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇదిలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ లో మావోయిస్టులు విధ్వసం సృష్టించారు అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో వీరాపురం దగ్గర వాహనాలపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు కార్లకు నిప్పు పెట్టారు రేపు తాము ఇచ్చిన భారత్ బంద్ పిలుపుని విజయవంతం చేయాలంటూ కరపత్రాలను మావోయిస్టులు వదిలి వెళ్లారు అయితే మావోయిస్టుల డిమాండ్స్ పై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు.
@@@@@ మరిన్ని వార్తలు@@@@@
బీఆర్‌ఎస్ ప్రభుత్వం 12 నుంచి 14 గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు.
తెలంగాణ సామాజిక స్పందన
హైదరాబాద్‌లో మాత్రమే 24 గంటల విద్యుత్ ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆడంబరాల కోసం ఖర్చు చేయబోమని, దుబారా తగ్గిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని క్యాంప్ ఆఫీసు కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు._
శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని వెల్లడించారు._
నేడు బీఏసీ సమావేశం ఉంటుదన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల అజెండాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.హైదరాబాద్‌లో ఉన్న మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలోని ఖాళీస్థలాన్ని ఇతర అవసరాల కోసం వినియోగించుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
ప్రజాభవన్‌లోని ఆఫీస్ కార్యాలయాన్ని ఉపయోగించుకుంటానని తెలిపిన ఆయన కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టంచేశారు.
శాసనసభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని రేవంత్‌రెడ్డి వివరించారు. *పాత భవనంలోనే కౌన్సిల్ సమావేశాలు ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలోనే శాసనసభ జరుగుతుందని* చెప్పారు. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ఉండబోతోందని తెలిపారు. *గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రోరైల్ ఉపయోగకరంగా ఉండదన్న రేవంత్ మరో మార్గంలో ప్రణాళికలు వేయనున్నట్లు వివరించారు...











0 Comments