సమ్మెకు మద్దతుగా మాట్లాడుతున్న రాజాసూరిబాబు రాజు.
కాకినాడ జిల్లా, పెద్దాపురం , సామాజిక స్పందన
సమస్యలు పరిష్కరించడం చేతకాని ప్రభుత్వం సెంటర్ తాళాలు బద్దలు కొట్టించే పని చేస్తుందని, ఇలాంటి బెదిరింపులకు బయపడేది లేదని ఎ.పి. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. రాష్ట్ర వ్యాపితంగా జరగుతున్న అంగన్‌వాడీల సమ్మె 3వ రోజు పెద్దాపురం మున్సిపల్ సెంటర్‌లో జరిగింది. మోకాళ్ళపై నిలుచుని అంగన్‌వాడీలు తమ నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించడం చేతకాని ప్రభుత్వం సెంటర్ తాళాలు బద్దలు కొడుతుందని అన్నారు. లబ్దదారుల అండతో దానిని ప్రతిఘిస్తామని తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్ తాళాలు అయితే బద్దలు కొట్టగలరు గాని లబ్దదారుల గుండెల్లో ఉన్న అంగన్‌వాడీలను ఎవరు పొగ్గోట్టలేరని అన్నారు. ఉదయం నుంచి అధికారులు అంగన్‌వాడీ సెంటర్‌లు తెగతిరుగుతున్నారని సెంటర్ అద్దెలు 6 నెలలు బకాయిలు ఉంటే దాని ఊసు ఏనాడు ఎందుకు తేలేకపోయారని అన్నారు. ట్రావిలింగ్ అలవెన్స్‌లు బకాయిలు ఉన్నాయంటే ఎందుకు మాట్లాడలేకపోయారని అన్నారు. అనేక చోట్ల మున్సిపల్ కమిషనర్, సిడిపివో వెళ్ళినా సెంటర్ తాళాలు బద్దలకొట్టలేకపోయారని అది అంగన్‌వాడీ ఉద్యమ విజయమే అని అన్నారు. సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుంది తెలపారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజాసూరిబాబు రాజు, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు రంది సత్తిబాబు, రాష్ట్ర యువజన కార్యదర్శి ఆరిఫ్ ఆలీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బేదం పూడి సత్తిబాబు, పెదకాపులు మద్దతు తెలియజేసారు. సమ్మెకు తమ సంపూర్ణమద్దతు ఉంటుందని తెలిపారు.
యుటిఎప్ జిల్లా కార్యదర్శి ఎమ్.ఎస్.సి మూర్తి, మండల కార్యదర్శి కెనడి, సీతారామారావు, షరీఫ్, మూర్తిలు మద్దతు తెలియజేసారు. తమ సంఘం రాష్ట్ర వ్యాపితంగా ఇప్పటికే మద్దతు ప్రకటించిందని ఎలాంటి పరిస్ధితుల్లో అయినా అంగన్‌వాడీలకు తోడుగా ఉపాధ్యాయులు ఉంటారని తెలిపారు.
సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో దాడి బేబి, నాగమణి, అమలా, ఎస్తేరు రాణి, ఫాతిమా, టిఎల్ పద్మ, కుమారి, కాలే దేవి, వరలక్ష్మీ, అన్నపూర్ణ, లోవతల్లి, వసంత, దీవెన, కృష్ణవేణి, చక్రవేణి తదితరులు పాల్గోన్నారు.










0 Comments