మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డి పై చీటింగ్ కేసు.


హైదరాబాద్ , సామాజిక స్పందన

మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై శామీర్ పేట పోలీసు స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది.


గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు మేరకు 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.


47 ఎకరాల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు ఎన్నికలు జరగుతున్న సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.


మల్లారెడ్డికి సహకరించిన ఎమ్మార్వో పైనా ఫిర్యాదు చేయటంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.


మల్లా రెడ్డితో పాటు అతని అనుచరులు ఆరుగురిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజిరి జిల్లా చింత లపల్లి మండలం లోని కేశవరం గ్రామంలోని సర్వే నెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ లంబాడీల వారసత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ.


మాజీ మంత్రి మల్లారెడ్డి అతని బినామీ అను చరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి కుట్రతో మోస గించి భూమిని కాజేశారని శామీర్‌పేట పోలీస్టేషన్‌లో కేతావత్ బిక్షపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.