నేటి నుండే ‘రైతుబంధు’ నిధుల విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..

 


తెలంగాణ , సామాజిక స్పందన

రాష్ట్రంలోని రైతులందరికీ ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి డా. బీ. ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్బంగా సి.ఎం. శ్రీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు నేటినుండే ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో వేసే ప్రక్రిను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా  పంట పెట్టుబడి సహాయం అందించాలని అన్నారు.

రుణ మాఫీపై కార్యాచరణ రూపొందించాలి  ? 

తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు రూ.రెండు లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకై తగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.


ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి ? 


ప్రస్తుతం ‘జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్’లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను ఇకనుండి ‘ప్రజావాణి’గా పిలవాలని సీఎం ఆదేశించారు. ఈ ‘ప్రజావాణి’ని ఇకనుండి ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటల లోపు జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటుచేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.. 

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.