కాకినాడ జిల్లా, సామాజిక స్పందన
అంగన్‌వాడీ వర్కర్లు హెల్పర్లు చేస్తున్న సమ్మె ను పరిష్కరించకుండా అబద్దాలు ఆడుతున్న స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యలకు నిరసనగా అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్యర్యంలో పాత బస్ స్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. దీనికి ముందుగా రాష్ట్ర వ్యాపితంగా జరుగుతున్న అంగన్‌వాడీల సమ్మె 11వ రోజు మున్సిపల్ సెంటర్‌లో ప్రారంభం అయ్యింది. అక్కడి నుండి ప్రదర్శనగా బయలుదేరి మెయిన్‌రోడ్, వినాయకుని గుడి సెంటర్, వేము లవారి సెంటర్, రాజుగారి వీధి మీదుగా పాత బస్‌స్టాండ్ సెంటర్‌కు చేరుకొని రాస్తారొకో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యదర్శి దాడి బేబి మాట్లాడుతూ రాష్ట్రంలో 11 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే సమస్య పరిష్కరించడం మానేసి అబద్దాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తుందని అన్నారు. తాళాలు ఎందుకు బద్దలు కొట్టాల్సివచ్చిందో చెప్పమంటే మేము ఆదేశాలివ్వలేదని ఒకసారి, ప్రభుత్వ ఆస్ధి బద్దలు కొడతామని ఒకసారి వింత వాదనలు చేస్తున్నారన్నారు. బాలింతలకు, గర్భిణులకు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించం చేతకాని ప్రభుత్వం అంగన్‌వాడీలను తప్పుపట్టడం దుర్మార్గమన్నారు. తెలంగాణా కంటే వెయ్యిరూపాయలు వేతనం పెంచుతామన్నామని అది ఎప్పుడో పెంచేసామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాళాలు బద్దలు కొట్టి పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు.
వేతనాల పెంపుదల గ్రాట్యూటీ కోసం మాట్లాడకుండా సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంగన్ వాడీల సమ్మెకు సహకారం అందిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమానికి సిఐటియు నాయకులు సిరిపురపు శ్రీనివాస్, చింతల సత్యనారాయణ, వడ్డి సత్యనారాయణ, దారపురెడ్డి కృష్ణ, డి. క్రాంతి కుమార్‌లు, ఆర్.సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి డి. నారాయణ,రాష్ట్ర కమిటీ సభ్యులు డి. నాగవిష్ణు మద్దతు తెలియజేసారు.
కార్యక్రమంలో ఎస్తేరు రాణి, నాగమణి, అమల, ఫాతిమా, టి.ఎల్. పద్మ, కాలే దేవి, జె.కుమారి, జ్యోతి, లోవతల్లి, వసంత కుమారి, వెంకట లక్ష్మీ, నాగమణి, స్నేహలత, సావిత్రి, రత్నం, లక్ష్మీ తదితరులు పాల్గోన్నారు.











0 Comments