తెలంగాణ , సామాజిక స్పందన
రేపు ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్ వేదికగా..
పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ చేయనున్న కేటీఆర్...
కాంగ్రెస్ ప్రభుత్వ శ్వేతపత్రంకు పోటీగా.. బీఆర్‌ఎస్ స్వేదపత్రం విడుదల చేయాలని భావించిన బిఆర్ఎస్..
ప్రభుత్వం వాస్తవాలు వక్రీకరించిందంటున్న బీఆర్‌ఎస్
అసెంబ్లీ వేదకగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై తమ వాదన వినిపించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది.
తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం వివరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా స్వేదపత్రంతో బీఆర్‌ఎస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది.
ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో స్పందించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు లేఖ రాశారు హరీష్‌రావు.
అయితే అధికార కాంగ్రెస్ పక్షం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్‌కు ఆ అవకాశం దక్కలేదు.
శ్వేతపత్రాల పేరుతో ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి తమపై బురద జల్లేందుకే ప్రయత్నించిందని విమర్శిస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు.
తాము వివరణలు కోరినా ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేదని.. అందుకే తెలంగాణ భవన్ వేదికగా స్వేద పత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెబుతోంది బీఆర్‌ఎస్.
.jpg)









0 Comments