హైదరాబాద్ , సామాజిక స్పందన
ఫిలింనగర్లో టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు నిన్న రాత్రి ఆందోళనకు దిగారు.
ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వర్మ. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే ఇటీవలే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వ్యూహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ సినిమా రిలీజ్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో వ్యూహం రిలీజ్ డేట్ మార్చారు వర్మ. ఈ చిత్రాన్ని ఈనెల 27న కాకుండా డిసెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు వర్మ.
ఈ క్రమంలోనే నిన్న ఆర్జీవీ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు టీడీపీ కార్యకర్తలు.అదే సమయంలో రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే వర్మ దిష్టి బొమ్మను సైతం దగ్ధం చేశారు. వ్యూహం సినిమాను రిలీజ్ చేయొద్దంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు రాగానే టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోయారని ట్వీట్ చేశారు ఆర్జీవీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
ఈ ఘటనపై నిర్మాత దాసరి కిరణ్ మాట్లాడుతూ సినిమాను సినిమాగానే చూడాలని అన్నారు ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలు ఇలా దాడులు చేయడం సరికాదని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 నుంచి 2019 వరకు జరిగిన రాజకీయ పరిస్థితులపై వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారు రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.










0 Comments