భర్తలు మోడీ జపం చేస్తే రాత్రి భోజనం పెట్టొద్దు : కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

  


ఢిల్లీ, సామాజిక స్పందన

భర్తలు మోడీ జపం చేస్తే రాత్రి భోజనం పెట్టొద్దు మహిళా ఓటర్లకు కేజ్రీవాల్ పిలుపునీచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ పేరును జపించే భర్తలకు రాత్రి భోజనం పెట్టొద్దని మహిళలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. కుటుంబ సభ్యులంతా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

రూ.1000 పథకం నిజమైన సాధికరత అని కేజ్రీవాల్ మహిళలతో అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పేరు జపిస్తే రాత్రి భోజనం వడ్డించొద్దని ముఖ్య మంత్రి శనివారం సూచించారు. 

చాలా మంది పురుషులు ప్రధాని నరేంద్రమోడీ పేరు జపిస్తున్నారు. కానీ మీరు దాన్ని సరిచేయాలి. మీ భర్తలు మోడీ పేరు జపిస్తే, అతనికి రాత్రి భోజనం పెట్టమని చెప్పండి అని ఢిల్లీలో జరిగిన మహిళా సమ్మాన్ సమరోహ్' అనే కార్యక్రమంలో చెప్పారు. ప్రభుత్వం తన 2024-25 బడ్జెట్‌లో ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలవారీ మొత్తాన్ని రూ. 1,000 అందించే పథకాన్ని ప్రకటించిన తర్వాత మహిళలతో సంభాషించడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడింది. 

ఆప్‌కి మద్దతు ఇస్తామని మహిళలు ప్రమాణం చేయాలని కేజ్రీవాల్ కోరారు. మీ సోదరుడు మీకు అండగా ఉంటారని, బీజేపీకి మద్దతు ఇచ్చే ఇతర మహిళలకు కూడా ఈ విషయం చెప్పాలని కోరారు. నేను మీకు ఉచిత కరెంట్, ఉచిత బస్ సౌకర్యం కల్పించానని, ఇప్పుడు ప్రతీ నెల మహిళలకు రూ. 1000 ఇస్తున్నానని చెప్పండి, బీజేపీ వారి కోసం ఏం చేసింది. ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి. ఈ సారి కేజ్రీవాల్‌కి ఓటేయండి అని కేజ్రీవాల్ అన్నారు. మహిళా సాధికారత పేరుతో ఇప్పటి వరకు మోసం జరుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అన్నారు.

పార్టీలు మహిళకు ఏదో ఒక పదవి ఇచ్చి మహిళలకు సాధికారత ఇచ్చామని చెబుతున్నాయి, మహిళలకు పదవులు వద్దని తాను చెప్పడం లేదని, దీని వల్ల ఇద్దరు ముగ్గురు మహిళలు మాత్రమే లబ్ధిపొందుతున్నారు, మిగిలిన స్త్రీలకు ఏం లభిస్తుంది. అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆప్ ప్రభుత్వం తీసుకువచ్చిన 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన' నిజమైన సాధికారత తీసుకువస్తుందని చెప్పారు. డబ్బు ఉన్నప్పుడే సాధికారత ఏర్పడుతుందని, మహిళలకు ప్రతీ నెల రూ. 1000 అందితే నిజమైన సాధికారత ఏర్పడుతుందని అన్నారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.