ఎన్నికల బాండ్లు వివరాలు వెంటనే SBI వెల్లడించాలి : పెద్దాపురం స్టేట్ బ్యాంక్ వద్ద సిపిఎం నిరసన

 


 కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన

           ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించిన సుప్రీంకోర్టు ఆ బాండ్లు ఎవరెవరు కొన్నారు, ఎవరికి ఇచ్చారు అనే అంశాలతో పూర్తి వివరాలను మార్చి 6 లాగా ఎన్నికల సంఘానికి నివేదించాలని ఎన్నికల సంఘం మార్చి 13 కల్లా వాటిని ప్రచురించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఆదేశించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివ‌రాలు బ‌య‌ట‌పెట్ట‌డానికి గ‌డువుకావాల‌న‌డం దారుణ‌మ‌ని సిపిఎం నాయ‌కులు సిరిపుర‌పు శ్రీ‌నివాస్ అన్నారు. ఎన్నిక‌ల బాండ్ల వివ‌రాలు త‌క్ష‌ణం బ‌య‌ట‌పెట్టాల‌ని, సుప్రీంకోర్డు తీర్పును అమ‌లు చెయ్యాల‌ని కోరుతూ సిపిఎం రాష్ట్ర క‌మిటీ పిలుపులో భాగంగా ఎస్‌.బి.ఐ పెద్దాపురం బ్రాంచి ముందు సిపిఎం ఆధ్వ‌ర్యంలో ద‌ర్నా నిర్వ‌హించ‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌నివాస్ మాట్లాడుతూ సుప్రీంకోర్డు ఇచ్చిన గ‌డువు ముగుస్తున్నా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎన్నికల బండ్లు వివరాలు ప్రకటించకుండా నాటకాలు ఆడుతున్నదని అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పై ఒత్తిడి తెచ్చి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకముందు ఈ వివరాలు వెల్లడిస్తే బిజెపికి కార్పొరేట్ కంపెనీల నుంచి ఎన్ని వేల కోట్లు అందాయో బట్టబయలు అవుతుందని కార్పొరేట్ కంపెనీలకు బిజెపికి ఉన్న అనుబంధం, లాలూచీ బయటపడతాయని ఆ వివరాలు వెల్లడించడానికి బదులు ఎస్బిఐ గడువు ముగిస్తున్న తరుణంలో మరో 116 రోజులు అదనపు గడుపు కావాలని కోర్టుని ఆశ్రయించి జూన్ 30 కల్లా కోరిని సమాచారం అంతా అందజేస్తామని తెలిపడం దారుణ‌మ‌న్నారు. ఎన్నికల ముగిసే వరకు బాండ్లు వివరాలు వెల్లడించకుండా కుట్ర‌ పన్నిందని స్పష్టమవుతుందని అన్నారు. 


        మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒత్తిళ్ళ కారణంగానే ఎస్బిఐ ఈ వైఖరి తీసుకుందని అన్నారు. ఎన్నికల బాండ్లను సంబంధించి వివరాలను ఎస్బిఐ అందజేసేలా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే ఎన్నికల బాండ్లు వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేసారు. 

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు డి. స‌త్య‌నారాయ‌ణ‌, ఆర్‌.వీర్రాజు, కె. అప్ప‌న్న‌, ఎన్‌. న‌రసింహ‌మూర్తి, సిహెచ్. విశ్వ‌నాధం, ఆర్‌. అరుణ్‌, క్రాంతి కుమార్‌, జ‌గ‌దీష్‌, శివ‌, చింత‌ల స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గోన్నారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.