రెడ్డిగూడెం,ఏప్రిల్ 12, సామాజిక స్పందన :
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త, స్వచ్ఛంద సేవకుడు, మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు ఎన్జీవో'స్ జాతీయ సంయుక్త కార్యదర్శి కోవిడ్ 19 సేవరత్న నేషనల్ అవార్డు గ్రహీత మల్లాది ప్రసాదరావు 2024 ప్రతిష్టాత్మక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు పురస్కారానికి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని గుర్తించి, భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సహారా చారిటబుల్ ట్రస్ట్ ఈ అవార్డులను అందజేస్తుంది. 2024 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ నుంచి మల్లాది ప్రసాదరావు ను ఎంపిక చేసింది. భారతదేశ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా, గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం
సామాజిక బాధ్యతగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురి మన్ననలు, అవార్డులు అందుకున్న మల్లాది ప్రసాదరావు అంబేద్కర్ అవార్డును 2024 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో అందుకోనున్నారు.ఆ మేరకు సహారా చారిటబుల్ ట్రస్ట్ సౌత్ జోన్ ఆర్గనైజింగ్ కమిటీ ఆహ్వాన లేఖను పంపారు.
సామాజిక ఉద్యమాల్లో విద్యార్థి నేతగా ప్రస్థానం మొదలై నేడు ఎన్జీవోస్ జాతీయ సంయుక్త కార్యదర్శిగా,మీడియా రంగంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ పాత్రికేయుడి స్థాయి నుండి స్వయంకృషితో అంచలంచెలుగా ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో గా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఎన్నో సామాజిక అస్మానతలను, రుగ్మతులను ఎదుర్కొని నిలదొక్కుకున్నారు. పిన్నవయసు నుండి సేవ భావం కలిగి ఉండి సమాజానికి తన వంతు స్వచ్ఛంద సేవ చేయాలనే సంకల్పంతో మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి శ్రేయోభిలాషులు, మిత్రుల సహకారంతో పాత్రికేయుడిగా ప్రకటనల రూపంలో వచ్చిన ఆదాయంలోనే కొంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అనాథ పిల్లలకు ఆసరాగా ఉండడం, వృద్ధులకు తోడుగా నిలవడం వంటివి చేస్తున్నారు. కొవిడ్ 19 లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అన్నార్తులు, మున్సిపల్ కార్మికులు, సొంత ప్రాంతాలకు కాలినడకన వెళ్తున్న ఇతర రాష్ర్టాల కార్మికులకు, కోవిడ్ వారియర్స్ పోలీస్, ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యం మాస్కులు, శానిటైజర్స్, మజ్జిగ, ఆహారం పంపిణీ చేశారు. స్వగ్రామంలో వేసవికాలం ప్రజల దాహదర్తి తీర్చేందుకు గత రెండు సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు బాటసారిలకు ఎందరో దహం తిరుస్తున్నారు.వృద్ధులు, వితంతువులకు,నిరాశ్రయులైన వారికి చలికాలం చలి నుండి రక్షణగా దుప్పట్లు,చీరలు పంపిణీ మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు, నిరుపేదల కోసం ఉచిత మెడికల్ క్యాంపులు ద్వారా మల్లాది ప్రసాదరావు చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు గాను 2024 సంవత్సరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా పురస్కర్ అవార్డుకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత మల్లాది ప్రసాదరావు మాట్లాడుతూ సేవలోనే సంతృప్తి
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఉన్న సంతృప్తి సేవ రంగంలో తప్ప ఏ రంగంలో దొరకదని దేశ అభివృద్ధి కోసం సమాజ సేవ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పురస్కారానికి ఎంపిక చేయడం నాకు సామాజిక బాధ్యతను మరింత పెంచింది అని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు మీద అవార్డు తీసుకోవటం నా పూర్వజన్మ సుకృతం అని అన్నారు.
అంబేద్కర్ జాతీయ అవార్డు అందుకుంటున్న మల్లాది ప్రసాదరావు ను గ్రామ ప్రజలు, స్వచ్ఛంద సేవకులు, ఎన్జీవో సంస్థలు,జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు,అధికారులు పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.










0 Comments