కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన
పెద్దాపురం చిల్డ్రన్ క్లబ్ ఆధ్వర్యంలో మే 7 వ తేదీ నుండి సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు తెలుపుతూ గోడపత్రికను ఆవిష్కరించారు.
యాసలపు సూర్యారావు భవన్ లో పిసిసి అధ్యక్షులు కూనిరెడ్డి అరుణ అధ్యక్షతన గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎమ్.ఎస్.సి మూర్తి, మన పెద్దాపురం ఫేస్ బుక్ అడ్మిన్ నరేష్ పెదిరెడ్డి, మిషన్ అన్నపూర్ణ సహాయనిధి రాజేష్ కుమార్ దేవత గోడపత్రిక ఆవిష్కరణ చేసారు.
ఈ సందర్బంగా పిసిసి గౌరవాధ్యక్షులు బుద్దా శ్రీనివాస్ మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్ ను వరుసగా మూడవ ఏడాది సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం కరాటే, క్లాస్ లు డ్రాయింగ్, మాధ్స్, స్పొకెన్ ఇంగ్లీషు, సైన్స్ ప్రయెాగాలు వంటి అనేక అంశాలలో విద్యార్దులకు సమ్మర్ క్యాంప్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
సమ్మర్ క్యాంప్ ను అందరూ సద్వినియెాగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. సమ్మర్ క్యాంప్ నిర్వహణకు ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ కు సహకరించిన విధంగానే పెద్దలు, ఉపాద్యాయులు సహకారం అందించాలని కోరారు.
పోస్టర్ ఆవిష్కరణలో పిసిసి కార్యదర్శి రొంగల అరుణ్, యుటిఎఫ్ మండల కార్యదర్శి కెనడి, యుటిఎఫ్ పట్టణ కార్యదర్శి మధుకుమార్, జయరాజు, సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు చల్లా విశ్వనాధం, దుంగల పూజితా, అమృత, నమ్రత, మంజులా, డి. శ్యామ్ కుమార్ స్వామి, గౌస్, వివేక్, థరణి, బంగారం, సందీఫ్ తదితరులు పాల్గోన్నారు.










0 Comments