ఏపీలో రూ. 100 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం స్వాధీనం..

 


ఆంధ్రప్రదేశ్ , సామాజిక స్పందన

ఎన్నికల వేళ ఏపీలో ఇప్పటి వరకు రూ. 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ చెక్‌ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల వద్ద సోదాలను మరింత విస్త్రృుతం చేస్తున్నామని వివరించారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసు బలగాలు, ఇతర ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ ఏజెన్సీలతో సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ తనిఖీల్లో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వ్యవహరించాలని బృందాలను ఆదేశించినట్లు సీఈవో వివరించారు.


రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ప్రలోభపర్చే నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘాను ఉంచడం జరిగిందన్నారు. అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల ద్వారాను మరియు పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్సు, ఫారెస్టు, ఇడి, ఎన్సీబి, ఆర్పిఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలకు పైబడి ఓటర్లను ప్రభావింతం చేసే వస్తువులపై నిరంతరం నిఘా కాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫలితంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తదుపరి నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.


రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ప్రలోభపర్చే నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘాను ఉంచడం జరిగిందన్నారు. అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల ద్వారాను మరియు పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్సు, ఫారెస్టు, ఇడి, ఎన్సీబి, ఆర్పిఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలకు పైబడి ఓటర్లను ప్రభావింతం చేసే వస్తువులపై నిరంతరం నిఘా కాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫలితంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తదుపరి నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను జప్తు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.


ఇందులో కేవలం గత 24 గంటల్లోనే రూ. 197.66 లక్షల విలువైన వస్తువులను జప్తుచేయడం జరిగిందన్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నాటి నుండి నేటి వరకూ చేయబడిన మొత్తం జప్తులో రూ. 2,503.13 లక్షల నగదు, రూ.1,249.68 లక్షల విలువైన 6,14,837.76 లీటర్ల లిక్కర్, రూ.205.94 లక్షల విలువైన 68,73,891.25 గ్రాముల డ్రగ్స్ ను, రూ.5,123.58 లక్షల విలువైన 11,54,618.90 గ్రాముల ప్రెషస్ మెటల్స్ను, రూ.242.94 లక్షల విలువైన 4,71,020 ఫ్రీ బీస్ను (ఉచితాలను) మరియు704.66 లక్షల విలువైన 9,84,148.09 ఇతర వస్తువులను జప్తుచేయడం జరిగిందని ఆయన తెలిపారు.



ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే సీఎం రేవంత్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. 


రాజన్న సిరిసిల్ల, సామాజిక స్పందన

నాలుగైదు నెలల్లోనే కరీంనగర్ ఏడారి అయ్యిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు అన్నారు. పొలం బాటలో భాగంగా శుక్రవారం నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. సాగునీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అన్నదాతలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


రాజ్యంలో ఉన్నది అసమర్థులు, చవట దద్దమ్మలని విమర్శించారు. కేసీఆర్ ప్రసంగం మధ్యలో గులాబీ నేతలు, కేసీఆర్ అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. గులాబీ నేతలను వారించారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను అగమాగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాలక్ష్మి లేదు. మన్ను లక్ష్మి లేదు అంతా మోసమని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం తప్పిదాల వల్ల 209 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రైతులకు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.


ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇక నీ డ్రామాలు నడవవని హెచ్చరించారు. కేఆర్ఎంబీ అధికారులు ఏమైనా తమకు బాసులా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి నేనా నువ్వా నేను వెళ్లగానే మోటార్లు ఆన్ చేశారు అని చెప్పారు. రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. డిసెంబర్ 9వ తేదీన మాఫీపై చేసిన సంతకం ఏమైందని నిలదీశారు.


గోదావరి నదీ మీద నిర్మించిన ప్రాజెక్టులు సజీవ జల ధారులు అని చెప్పారు. మిడ్ మానేరు బ్రిడ్జి సముద్రం లాగా ఉండేదని.. ప్రస్తుత ప్రభుత్వ తెలివి తక్కువ తనంతో ఇప్పుడు ఎండిపోయిందని అన్నారు. 2014 కన్నా ముందు ఉన్న తెలంగాణ ఇప్పుడు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో పంటలు ఎండని జిల్లానే లేదని మండిపడ్డారు.

ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలించిన తెలంగాణ అయ్యిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో లత్కోర్‌లు రాజ్యం ఏలుతున్నారని ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువేనని అన్నారు. కిరికిరి మాటలు చెప్పి తప్పించుకోవద్దని అన్నారు. 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.


మంత్రి కోమటిరెడ్డిని జైళ్లో పెట్టెవాళ్లం.


మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి‌పై కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనను తన ప్రభుత్వంలో జైల్లో పెట్టాలనుకుంటే పెట్టేవాళ్లమని హెచ్చరించారు. మిడ్ మానేరు కట్ట కొట్టుకు పోవడానికి కోమటిరెడ్డి కంపెనీయే కారణం కాదా అని ప్రశ్నించారు. ఇవాళ ఆ మంత్రి అడ్డం పొడవు మాట్లాడుతున్నారని కేసీఆర్ విరుచుకుపడ్డారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.