పెద్దాపురం పట్టణంలో, వేస‌విలో విద్యార్ధుల‌కు సైన్స్ ప్ర‌యోగాల‌పై శిక్ష‌ణ‌.



కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన

    పెద్దాపురం చిల్డ్ర‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో వ‌ర‌హాల‌య్య‌పేట యాస‌ల‌పు సూర్యారావు భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న‌స‌మ్మ‌ర్ క్యాంప్‌లో విద్యార్ధుల‌కు సైన్స్ ప్ర‌యోగాల‌పై శిక్ష‌ణ ఇచ్చారు. జ‌న‌విజ్ఞాన వేదిక సైన్స్ అండ్ టెక్నాలజీ జిల్లా క‌న్వీన‌ర్ బుద్దా శ్రీ‌నివాస్ సైన్స్ ప్ర‌యోగాలు చేసి విద్యార్ధుల‌తో చేయించారు. ఇలాంంటి సైన్స్ ప్ర‌యోగాలు నిజ‌జీవితంలో ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని తెలిపారు. నిత్యం మనం చేసే ప్ర‌తి ప‌ని సైన్స్‌కి ముడిప‌డి ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌టి ఒక‌దానితో మ‌రొక‌టి స‌హాయ‌స‌హ‌కారాలు తీసుకుంటూనే ఉంటుద‌ని తెలిపారు. 


     స‌మ్మ‌ర్ క్యాంప్‌లో ఉద‌యం విద్యార్ధిని విద్యార్ధుల‌కు దుంగ‌ల పూజితా సూర్య‌శ్రీ క‌రాటే శిక్ష‌ణ ఇచ్చారు. నీల‌పాల కృష్ణ క‌ర్ర‌సాము నేర్పించారు. విద్యార్ధుల ఆత్మ‌స్ధైర్యానికి ఇవి ప్ర‌తీక‌గా నిలుస్తాయ‌ని వీటిని నేర్చుకోవ‌డంలో శ్ర‌ద్ద మ‌రింత పెట్టాల‌ని విద్యార్ధుల‌కు గురువులు తెలిపారు. డ్రాయింగ్ శిక్ష‌ణ శ్యామ్‌కుమార్‌స్వామి ఇచ్చారు. 

      చిల్డ్ర‌న్స్ క్ల‌బ్ అధ్య‌క్ష‌, కార్య‌దర్శులు కూనిరెడ్డి అరుణ‌, రొంగ‌ల అరుణ్‌, మంజులా, అమృత‌, సాయి, బంగారం, మ‌ణికంఠ‌, నేహా, రేణుకా, శ్రీ‌జా త‌దిత‌రులు శిక్ష‌ణ‌లో వాలంటీర్లుగా వ్య‌వ‌హ‌రించారు.

@@@@@@@ మరిన్ని వార్తలు చదవండి@@@@@@@


దక్షిణాదిలో గరం గరం, ఎంత రీడింగ్ నమోదు అయిందో తెలుసా??? 



న్యూఢిల్లీ, సామాజిక స్పందన

 దక్షిణాదిలో ఎండలు దంచికొడుతున్నాయి. సౌత్ రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ఓవైపు.. ఎండల వేడి మరోవైపు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి..


రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. జనాలను ఎండ వేడికి ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే 40 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అవసరమైతేనే బయటికి రావాలని.. వాతావరణ శాఖ సూచిస్తోంది. రానున్న మరో 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలో వేడిగాలుల వీస్తాయని.. కరీంనగర్, నల్గొండ, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, వనపర్తి, యాదాద్రి, రంగారెడ్డి, జిల్లాలకు రెడ్ అలర్డ్ జారీ చేసింది.


ఎండ వేడిమికి అల్లాడుతున్న సాధారణ జనాలు ఓవైపు అయితే... సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారానికి జనాలు రాక.. పార్టీల నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో అసెంబ్లీకి... పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ... ప్రచారాలు ముమ్మరం చేయాల్సిన సమయంలో.. ఎండ వేడిమికి తాళలేక జనాలు బయటికి రావడం లేదు. వీలైనంత వరకూ పార్టీలు సైతం.. ఉదయం.. సాయంత్రం మాత్రమే ప్రచారాలకు ప్లాన్ చేసుకుంటున్నాయి.


సౌత్ మొత్తంలో కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కేరళలో హీట్‌వేవ్ ఎక్కువగా ఉండటంతో.. పాలక్కాడ్‌, మలప్పురం, అలప్పుజా నియోజకవర్గాల్లో ముగ్గురు ఓటర్లు మృతిచెందారు. ఎండ వేడి తట్టుకోలేక వాళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కోజికోడ్‌లో ఓ పోలింగ్ ఏజెంట్ మృతిచెందాడు. 48 డిగ్రీలు ఎండ, వేడిగాలులతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.