వాడ‌వాడ‌ల మేడే సంబరాలు, సిఐటియు ఆధ్వ‌ర్యంలో కార్మికుల ప్ర‌ద‌ర్శ‌న‌

 


కాకినాడ జిల్లా, పెద్దాపురం , సామాజిక స్పందన

ప్ర‌పంచ కార్మిక దినోత్స‌వం మేడే సంద‌ర్బంగా వాడ‌వాడ‌ల సిఐటియు ఆధ్వ‌ర్యంలో మేడే జెండాలను ఆవిష్కరించారు. పెద్దాపురం ప‌ట్ట‌ణంలో ర్యాలీ నిర్వ‌హించారు. పెద్దాపురం ప‌ట్ట‌ణంలో యాస‌లపు సూర్యారావు భ‌వ‌న్‌లో ప్రైవేట్ ఎల‌క్ర్టిక‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ గౌర‌వాధ్య‌క్షులు చింత‌ల స‌త్య‌నారాయ‌ణ‌, టి. గంగ‌, సినిమాసెంట‌ర్‌లో పాండ‌వ‌గిరి పెయింటింగ్ యూనియ‌న్ నీలం శ్రీ‌ను, వ‌డ్డి స‌త్య‌నారాయ‌ణ‌, పాశిల వీధి మ‌రిడమ్మ‌త‌ల్లి పెయింటింగ్ యూనియ‌న్ నాయ‌క‌లు తైనాల శ్రీ‌ను, గూనురు ర‌మ‌ణ‌, ఐసిడిఎస్ కార్యాల‌యం వ‌ద్ద టి.ఎల్‌. ప‌ద్మ‌, కొత్త‌పేట‌లో సిఐటియు నాయకులు గ‌డిగ‌ట్ల స‌త్తిబాబు, మున్సిప‌ల్ కార్యాయ‌లం వ‌ద్ద వ‌ర్రే గిరిబాబులు మేడే జెండాలు ఆవిష్క‌ర‌ణ చేసారు. 

       రూర‌ల్ ప్రాంతాల్లో పులిమేరు దాడి బేబి, గోరింట విజ‌య‌ల‌క్ష్మీ, చంద్ర‌మాంప‌ల్లి మాగాపు నాగు, తాటిప‌ర్తి కేదారి నాగు, కాండ్ర‌కోట పేప‌కాయ‌ల స్వామి, ఆనూరులో గంగాధ‌ర్‌. కొత్తూరులో అర్జున్‌, రాక్ సిరామిక్స్ గేటు వ‌ద్ద నాగార్జున‌, క‌ట్ట‌మూరులో వ‌సంత‌, ఆర్‌.బి.ప‌ట్నంలో వ‌ర‌ల‌క్ష్మీ, ఆర్‌.బి కొత్తూరులో ఈగ‌ల స‌త్తిబాబులు సిఐటియు జెండాల‌ను ఆవిష్క‌రించారు. 

     ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు సాధించుకున్న హ‌క్కు మేడే అన్నారు. ప‌ని గంట‌ల పోరాటంలో పుట్టిన ఎర్ర‌జెండాను మ‌నం కాపాడుకోవాల‌ని, ఎర్ర‌జెండా అండ‌తో ఉద్య‌మాల‌ను న‌డ‌పాల‌ని పిలుపునిచ్చారు. కార్మికుల ప‌ని గంట‌ల‌ను పెంచుతు కార్మిక వ‌ర్గంపై తీవ్ర వత్తిడి చే్స్తున్న బ‌డా పెట్టుబ‌డి దారులు, వారికి కొమ్ము కాస్తున్న ప్ర‌భుత్వాల‌ను ఓడించాల‌ని పిలుపునిచ్చారు. 

    ఉత్సాహంగా మేడే ర్యాలీ..

               యాస‌ల‌పు సూర్యారావు భ‌వ‌నం నుండి ప్రారంభ‌మైన ర్యాలీ ఉత్సాహ‌పూరిత వాత‌వ‌ర‌ణంలో జ‌రిగింది. తీన్‌మార్‌, డ‌ప్పుల‌తో ప్రారంభ‌మైన ర్యాలీ శోభాదియోట‌ర్ సెంట‌ర్‌. ఎమ్‌.ఆర్‌.ఎఫ్ షోరూమ్ సెంట‌ర్‌, వినాయ‌కుని గుడి, వేముల‌వారిసెంట‌ర్‌, వెంక‌టేశ్వ‌ర‌స్వామి గుడి సెంట‌ర్ మీదుగా సినిమా సెంట‌ర్‌కు చేరుకుంది. సినిమా సెంట‌ర్‌లో ఉన్న బొమ్మ‌న బ‌స‌వ‌రాజు విగ్ర‌హానికి చ‌ల్లా విశ్వ‌నాధం, డి. కృష్ణలు పూలమాల‌వేసి నివాళి అర్పించారు. అనంత‌రం ర్యాలీ ముగించారు. 

     కార్య‌క్రమంలో సిఐటియు మండ‌ల కార్య‌ద‌ర్శి డి. క్రాంతి కుమార్‌,ఎన్‌.సూరిబాబు, శ్రీ‌నివాస్‌, జాగార‌పు కుమారి, భ‌వానీ, క‌ర‌ణం అప్పారావు, రాజ‌మంద్ర‌పు రామారావు, ర‌మ‌ణ‌, బూసారి శ్రీ‌ను, స‌త్య‌వ‌తి, ప్ర‌జానాట్య‌మండ‌లి క‌ళాకారులు కృష్ణ‌, వీర్రాజు, రాంబాబు, స‌త్యానారాయ‌ణ త‌దిత‌ర‌లు పాల్గోన్నారు.



ఐక్య పోరాటాల ద్వారానే కార్మిక హక్కుల పరిరక్షణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్.


కాకినాడ జిల్లా,  పెద్దాపురం, సామాజిక స్పందన

ఐక్య పోరాటాలు నిర్వహించటం ద్వారానే కార్మిక హక్కులు పరిరక్షించబడతాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు.మేడే దినోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి స్థానిక మెయిన్ రోడ్ లోని ఆంజనేయ స్వామి గుడిసెంటర్లో సిఐటియు మండల నాయకులు దాడి బేబీ అధ్యక్షతన జరిగిన మే డే సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.బ్రిటిష్ వారి కాలం నుండి అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను ఎన్డీఏ ప్రభుత్వం రద్దుచేసి 4 లేబర్ కోడ్ లుగా మార్చి కార్మికుల ప్రయోజనాలను రద్దు చేసిందన్నారు.రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిన బిజెపి కి అండగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి,ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు పోటీపడి మరీ మద్దతు తెలుపుతున్నారన్నారు.

ఈ సభలో సిఐటియు నాయకులు డి క్రాంతి కుమార్,గడిగట్ల సత్తిబాబు,చింతల సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు.ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.కళాకారులు వీర్రాజు,కృష్ణ,సత్యనారాయణ,రాంబాబు,నాగు బృందం కార్మిక గీతాలు ఆలపించారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.