కాకినాడ జిల్లా , పెద్దాపురం, సామాజిక స్పందన..
ప్రాధమిక పాఠశాల, హైస్కూల్ స్ధాయి నుంచే పోటీ పరిక్షలకు విద్యార్ధులు సిద్దం కావాలని మాష్టర్ ట్యూషన్ సెంటర్ మహ్మాద్ రఫీ అన్నారు. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరహాలయ్యపేట యాసలపు సూర్యారావు భవన్‌లో జరుగుతున్నసమ్మర్ క్యాంప్‌లో 16వ రోజు విద్యార్ధులతో రఫీ షఫీ ఇద్దరూ విద్యార్ధుకు వివిధ అంశాలపై భోదించారు. ప్రాధమిక పాఠశాల 5వ తరగతి నుండే నవోదయా పరిక్షలకు విద్యార్ధులు సిద్దం కావడంతోనే పోటీ పరిక్షలు ప్రారంభం అవుతాయని తెలిపారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని పరిక్షలో విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. చదువులో అవరోదాలు వస్తూ ఉంటాయని కానీ వాటిని అధిగమించడంలోనే మన సామర్ధ్యం ఆదారపడి ఉంటుందని అన్నారు. ప్రభుత్వ నిర్వహించే స్కాలర్ షిఫ్ పరిక్షలకు మనం సిద్దంగా ఉండాలన్నారు. జనరల్ నాలెజ్ఞ్ పెంపుదలకు మనందరం కృషి చేస్తేనే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
సమ్మర్ క్యాంప్‌లో ఉదయం విద్యార్ధిని విద్యార్ధులకు దుంగల పూజితా సూర్యశ్రీ కరాటే శిక్షణ , నీలపాల కృష్ణ కర్రసాము నేర్పించారు.
చిల్డ్రన్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు బుద్దా శ్రీనివాస్, అధ్యక్ష, కార్యదర్శులు కూనిరెడ్డి అరుణ, రొంగల అరుణ్, మంజులా, అమృత, సాయి, బంగారం, మణికంఠ, నేహా, రేణుకా, కె. రవి, కె. పవన్, సాయిరాం శిక్షణలో వాలంటీర్లుగా వ్యవహరించారు.










0 Comments