పారిశుధ్యం మెరుగు పరచాలని గ్రీవెన్స్ లో ఆర్.డి.వో కి సిపిఎం వినతి.

 


కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన

   పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని, పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఎం పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్దాపురం రెవిన్యూ డివిజనల్ అధికారికి గ్రీవెన్స్ లో లేఖ అందజేసారు. 

     పెద్దాపురం పట్టణంలో  ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీమరిడమ్మ అమ్మవారి జాతద మహోత్సవాలు జూలై నెల నుండి ఆగష్టు వరకూ దాదాపు నెల రోజుల పైబడి జరుగుతాయ ఈ జాతర మహోత్సవాలకు పెద్దాపురం చుట్టుప్రక్కల ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోనూ, దేశంలోనూ వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తుంటారని తెలిపారు. 

     వర్షాలు ప్రారంభం అయ్యాయని దీనితో కాల్వ మురుగునీరు రోడ్డుపైన ప్రవహించడం మామూలే అయిపోయింది. ఎప్పటి చెత్త అప్పుడు ఎత్తక పోవడంతో వర్ష నీటిలో చెత్తచేరి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. 


చాలా చోట్ల మంచినీటి పైప్లు లీక్ అయ్యి వర్షపు నీరు అందులో కలసిపోయి మంచినీరు కలుషితం అయే పరిస్ధితివచ్చిందని తెలిపారు. అందువల్ల పట్టణంలో పారిశుధ్యం మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని  అవసరమైన సిబ్బందిని అదనంగా నియమించి పనులు చేయించాలని లేఖలో కోరారు. 


ఇతర ప్రాంతాల నుండి వచ్చే మహిళా యాత్రికులు, భక్తుల కోసం పట్టణంలో ప్రదానమైన చోట్ల మరుగుదొడ్లు ఏర్పాటుచేయాల విజ్ఞప్తి చేసారు.  ఈ పని కోసం దేవాదాయ ధర్మదాయ శాఖ నుండి పారిశుధ్య కార్మికులను నియమించాలని కోరారు. వేములవారి సెంటర్ లో ఉన్న మరుగుదొడ్లను వాడకంలోకి తెవాలని, ఒక పారిశుద్య కార్మికుడిని పూర్తిగా దీనికి కేటాయించాలన్నారు. 

       సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, సిరపురపు శ్రీనివాస్, దారపురెడ్డి కృష్ణ, రొంగల వీర్రాజులు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.