కూచిపూడి నృత్యంలో బ‌హుమ‌తులు గెలుచుకున్న చిన్నారులు

 


  కాకినాడ జిల్లా, సామాజిక స్పందన    

      అభిన‌య ఆర్ట్స్ తిరుప‌తి వారి ఆధ్వ‌ర్యంలో తిరుప‌తి మ‌హాతి ఆడిటోడియంలో జూలై 21 నుండి 28 వ‌ర‌కూ జ‌రిగిన రాష్ట్రస్ధాయి నృత్య, నాట‌క పోటీల‌లో చిన్నారులు కూచిపూడి ప్ర‌ద‌ర్శ‌న‌లో బ‌హుమ‌తులు గెలుచుకున్నారు. పెద్దాపురం సామ‌ర్ల‌కోట భావ‌యామి ఇనిస్టిట్యూష‌న్ ఆఫ్ ఆర్ట్స్ మ్యూజిక్‌ అండ్ డాన్స్ అకాడ‌మి నుండి విద్యార్ధులు ఈ పోటీలో పాల్గోన్నారు.  కూచిపూడి నాట్య‌గురువులు చ‌క్ర‌వ‌ర్తుల ప‌వ‌న్‌కుమార్‌, పురాణం సృజ‌న ర‌విచంద్రిక ల ఆధ్వ‌ర్యంలో విద్యార్ధులు పోటీలో పాల్గోన్నారు.  8 రోజుల పాటు జ‌రిగిన పోటీలో రాష్ట్ర వ్యాపితంగా 1500 మందిపైబ‌డి విద్యార్ధులు పోటీలో పాల్గోన్నార‌ని తెలిపారు. ఈ పోటీలో భావ‌యామి ఇనిస్టిట్యూట్ నుండి విద్యార్ధులు బ‌హుమ‌తులు గెలుపొంద‌డం చాలా సంతోష‌మన్నారు.  సాంస్కృతిక రంగంలో విద్యార్ధుల‌కు త‌ర్పీదు ఇవ్వ‌డంలో శిక్ష‌ణ జరుగుతుంద‌ని తెలిపారు. 

       కూచిపూడి పోటీలో జూనియ‌ర్స్ సోలో విభాగంలో  దార‌పురెడ్డి సూర్య అఖిల బెస్ట్ ఫెర్‌ఫామెన్స్‌, సీనియ‌ర్స్ సోలో విభాగంలో ఎన్‌.కావ్య‌శ్రీ క‌న్ష‌లేష‌న్‌, బ్ర‌హ్మ‌మొక్క‌టే పాట‌కు జూనియ‌ర్స్ గ్రూపువిభాగంలో యు. మ‌హిత‌, యు. అన్విత‌, బి. గ్రీష్మ‌, జి.ఆర్శ‌ని, ఎ.భ‌వ్యఈశ్వ‌రి, కె. సాత్విక‌, ఎన్‌. రోహిత లు బెస్ట్ ఫెర్‌ఫామెన్స్‌, భ‌జ‌మాన‌స పాట‌కు సీనియ‌ర్స్ గ్రూపు విభాగంలో డి. తుల‌సి, డి. అశ్రిత‌, ఎన్‌.మోక్ష‌, టి. శ్రీ‌జ‌, డి.దివ్య‌లు బెస్ట్ ఫెరఫామెన్స్ అవార్డులు అందుకున్నారు.  విజేత‌ల‌కు అబినంద‌న‌లు తెలిపారు.

@@@@@@@ మరిన్ని వార్తలు చదవండి@@@@@@@


మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కి షాక్ ఇచ్చిన కోర్టు.


పల్నాడు జిల్లా, సామాజిక స్పందన

ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి పై పోలింగ్ ఏజెంట్ పై హత్యాయత్నం కేసు కూడా నమోదు అయింది. ప్రస్తుతం నెల్లూరు జైలులో పిన్నెల్లి ఉన్నారు. అదనపు విచారణ కోసం కస్టడీకి అప్పగించాలన్న పోలీసులు..


రెండ్రోజుల కస్టడీకి అనుమతినిచ్చిన మాచర్ల కోర్టు..

 వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈవీఎం పగులగొట్టడం, పోలింగ్ ఏజెంట్ పై హత్యాయత్నం కేసులను ఎదుర్కొంటున్న పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు.


అదనపు విచారణ కోసం పిన్నెల్లిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు మాచర్ల కోర్టును కోరారు. పోలీసుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... పిన్నెల్లిని రెండ్రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 


మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఏపీలో పోలింగ్ రోజున పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి ఈవీఎం ధ్వంసం చేయడం వీడియోల ద్వారా వెల్లడైంది. అదే పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్ గా ఉన్న నంబూరి శేషగిరిరావు, తనను చంపేయాలంటూ పిన్నెల్లి వైసీపీ శ్రేణులను ఉసిగొల్పారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.