అత్యాచారం చేసి, హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి.
కాకినాడ జిల్లా, పెద్దాపురం, సమాజిక స్పందన
కోల్కతాలో మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని సిఐటియు , ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. అత్యాచారానికి గురై హత్య చేయబడిన మహిళా డాక్టర్ కి నివాళిగా పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. డాక్టర్ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి కట్టించారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జోషుల కృష్ణ బాబు మాట్లాడుతూ దేశంలో మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుపై అన్నారు, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెబుతూనే వారి ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. గతంలో నిర్భయ అత్రాస్ ఘటనలు అనేక చూసామన్నారు. మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల నీ సిఐటియు నాయకురాలు దాడి బేబీ మహిళా సంఘం నాయకురాలు కోనరెడ్డి అరుణ, ప్రసంగించారు.
కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు అనంతరం, రమ, కుప్పట్ రవి, మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి రాజేష్ కుమార్ దేవత, హాస్పటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు వంగలపూడి సతీష్, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు అంగన్వాడీలు, ఫోటో యూనియన్ నాయకులు వరహాల రాజు, సతీష్ ప్రజానాట్యమండలి నాయకులు వీర్రాజు కృష్ణ బుద్ధా శ్రీనివాస్ రంగాల అరుణ్ అమృత పూజిత తదితరులు పాల్గొన్నారు..










0 Comments