కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన
మన జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించేది ఫోటో అని పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు అన్నారు. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ పెద్దాపురం చిల్డ్రన్స్ లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కి ముఖ్యఅతిథిగా హాజరే ప్రసంగించారు. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు ఏర్పాటు చేసినటువంటి నేచురల్ ఫోటో కాంటెస్ట్ ఫోటోల ఎగ్జిబిషన్ ను మిషన్ అన్నపూర్ణ సహాయనిది వ్యవస్థాపకులు రాజేష్ కుమార్ దేవత ప్రారంభించారు. సందర్భంగా పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు బుద్ధ శ్రీనివాస్ అధ్యక్షతన సభ జరిగింది. సభకు ముందుగా కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన సూరిబాబు రాజు మాట్లాడుతూ మన జీవితంలో ఎన్నో జ్ఞాపకాలను మన ముందు కెమెరా నిలుపుతుందన్నారు. మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు ప్రతి సందర్భంలోనూ ఫోటో జ్ఞాపకాలను ప్రజల పరిస్థితి అన్నారు. ఎన్నో అవంతరాలను ఎదుర్కొంటూ అద్భుతమైన చిత్రాలను కళ్ళకు కట్టినట్టు చూపించడంలో ఫోటోగ్రాఫర్లు శ్రమ వెలకట్టలేనిది అన్నారు.
ఫోటోగ్రాఫర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు తోట సూర్య సుబ్బారావు ఫోటో క్లబ్ నెంబర్ కరి నాగేశ్వరరావు, జిల్లా కోశాధికారి పేపకాయల బద్రి, ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు దేశపల్లి వరహాల రాజు, కార్యదర్శి ఎస్ ఎల్ రెడ్డి, కోశాధికారి బల్ల సతీష్, గౌరవ అధ్యక్షులు అల్లాడి రమణ, జిల్లా నెంబర్ బికినీ శ్రీనివాస్ సీనియర్ ఫోటోగ్రాఫర్ ఆణిముర్తి, వీడియోస్ ప్రసాద్ బీరక శివప్రసాద్, పెద్దిరెడ్డిల చిన్ని, చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కూనిరెడ్డ అరుణ రొంగాల అరుణ్, అమృత నేహా రేణుక సాయి ఫోటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.. .
@@@@@@@మరిన్ని వార్తలు చదవండి@@@@@@@
పాఠశాలల్లో వసతి గృహాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయండి : ఆర్డీవో ఒక సిపిఎం వినతి.
కాకినాడ జిల్లా ,పెద్దాపురం ,సామాజిక స్పందన
పెద్దాపురం పట్టణం మరియు మండలంలో ఉన్న అన్ని పాఠశాలలు వసతి గృహాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేసింది. పెద్దాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి వారికి సిపిఎం ప్రతినిధి బృందం వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దాపురం మండలం పట్టణ ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత చాలా ఎక్కువగా ఉందన్నారు. మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ జ్వరాలతో పాటు వాంతులు విరేచనాల కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి అన్నారు. చదలాడు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు జులై 28 తేదీన ఒకరు,, ఆగస్టు 13వ తేదీన ఒకరు మరణించడం జరిగిందన్నారు. ఇప్పటికే పట్టణంలోనూ రూరల్ ప్రాంతాల్లోనూ పాఠశాలల విద్యార్థుల సంఖ్య జ్వరాలతో తగ్గుతుందని తక్షణం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెడికల్ క్యాంపులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
వినతి పత్రం అందించిన వారిలో సిపిఎం నాయకులు సిరపరపు శ్రీనివాస్ , కేదారి నాగు, క్రాంతి కుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు...












0 Comments