కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన
2000 సంవత్సరంలో విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో పోలీసు తూటాలకు బలైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిలకు సిపిఎం ఆధ్వర్యంలో ఘననివాళి అర్పించారు. పెద్దాపురం అసలు సూర్యరావు జరిగిన కార్యక్రమంలో విద్యుత్ సంస్కరణలలో భాగంగా స్మార్ట్ మీటర్లను బిగుంపు వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబుమాట్లాడుతూ,
విద్యుత్ ఉద్యమం ఫలితంగా 15 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా విద్యుత్ ధరలు పెంచేందుకు సాహసించలేదని తెలిపారు. ఈ విద్యుత్ పోరాటం సందర్భంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు జరిపిన కాల్పులలో ఇద్దరు సిఐటియు కార్యకర్తలు అమరులయ్యారని గుర్తుచేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్తు ధరల పెరుగుదలను వ్యతిరేకించిన ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు నేడు అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడవకముందే యూటర్న్ తీసుకుని ప్రజలపై విద్యుత్ భారాలు మోపేందుకు సిద్ధపడ్డారని విమర్శించారు. అదాని కంపెనీ నుండి స్మార్ట్ మీటర్లు రాష్ట్రానికి చేరుకున్నాయని, ప్రయోగాత్మకంగా ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల్లో బిగించిన స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేయడాన్ని గుర్తుపెట్టుకోవలన్నారు. వీటివల్ల విద్యుత్తు ధరలు పెరగడమే కాకుండా, రైతుల 9 గంటల ఉచిత విద్యుత్ కి మంగళం పాడబోతున్నారని, వేలమంది మీటర్ రీడర్ల ఉపాధి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం స్మార్ట్ మీటర్ల బిగింపు మానుకోవాలని, తెలుగుదేశంపార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన పిలుపుకి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిరపడు శ్రీనివాస్ డి కృష్ణ డి సత్యనారాయణ మహాపాతిన రాంబాబు, వీర్రాజు, కే అరుణ, కే నరసింహమూర్తి, గడిగట్ల సత్తిబాబు, అమృత నమ్రత తదితరులు పాల్గొన్నారు...










0 Comments