వరద బాధితులకు అండగా మేమున్నామంటున్నా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్..


మానవత్వం చాటుకుంటున్న NARA.

విజయవాడలో ప్రకృతి విలయతాండవంతో మునుపెన్నడూ లేని రికార్డు స్థాయిలో వరద బీభత్సవానికి కుటుంబాలకు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో నిరాశ్రయులుగా మిగిలిపోయారు..


వరదల కారణంగా చాలామంది జీవనోపాధి, నివాసాలు కోల్పోవడంతో ఈ కష్టకాలంలో వారికి తమ వంతు అండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) తమ సేవలు అందించడానికి ముందడుగు వేసింది.. నిరాశ్రయులైన వారికి నిత్యవసర సరుకులు పంపిణీ, భోజనం, వాటర్ బాటిల్స్ పంపిణీకి శ్రీకారం చుట్టింది...


జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కొరకు స్థాపించిన "నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్" జర్నలిస్టుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపటానికి జాతీయ స్థాయిలో అవిశ్రాంత పోరాటం చేస్తూ అనతికాలంలోనే భారతదేశంలో అత్యధిక సభ్యులు కలిగి జర్నలిస్టుల గుండెచప్పుడుగా అగ్రభాగంలో నిలిచింది..


జర్నలిస్టుల సంక్షేమం రక్షణ ముఖ్య లక్ష్యంగా "వార్తా ప్రపంచం" దినపత్రిక చీఫ్ ఎడిటర్ బండి సురేంద్ర బాబు ఆధ్వర్యంలో "నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్" ఆవిర్భవించింది. "నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్" వివిధ జాతీయ విపత్తుల్లో స్పందించిన మాదిరిగానే కరోనా సమయంలో కూడా తన ఉదారతను చాటుకున్నారు.. హుద్ హుద్, తితిలీ, కేరళ ప్రకృతి విపత్తుల సమయంలో "నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్" స్వయంగా బాధితులను ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించిన సందర్భాలు ఉన్నాయి. తన బృందాలను సహాయక కార్యక్రమాల విషయంలో సమాయత్తం చేస్తూ వారికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చడమే కాకుండా నేరుగా "నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్"నాయకులు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. జర్నలిస్టులు వార్తలు రాయడమే కాకుండా ఇలాంటి సేవలు కూడా చేస్తారా? అనేటట్లు "నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్" వివిధ సందర్భాలలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వేసవిలో చలివేంద్రాలను విస్తృతంగా ఏర్పాటుచేసి దాహార్తిని తీర్చడంలోను, అన్నదాన కార్యక్రమాలను, మెడికల్ క్యాంపు నిర్వహించడం లోను సురేంద్ర బాబు నాయకత్వంలోని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఎప్పుడూ ముందుంటుంది.


ఎన్.ఏ.ఆర్.ఏ జాతీయ అధ్యక్షులు బండి సురేంద్ర బాబు మాట్లాడుతూ ఆర్థికంగా ఎన్నో వ్యయ ప్రయసాలతో జర్నలిస్టుగా పని చేస్తు ఈరోజు తాము సైతం సామాజిక సేవలో బాధ్యతగా వరద బాధితులకు ఆర్థిక సహాయంతో పాటు బియ్యము, బట్టలు, నిత్యావసర సరుకులు తదితర సామాగ్రిని సేకరించి వారికి అందించడానికి ప్రతి ఒక్క దాతలు ముందుకు వచ్చి మేము చేసే ప్రయత్నానికి సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. 


వరద బాధితులకి సహాయం చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ మీకు తోచిన సహాయం చేసి ఈ మంచి ప్రయత్నానికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము..


*అందరూ సహకరిస్తారని ఆశిస్తూ...*


***********

*ACCOUNT NAME:*

NATIONAL ACTIVE REPORTERS

ASSOCIATION - NARA

CURRENT ACCOUNT

STATE BANK OF INDIA

A/C NO:37569521092

IFSC CODE: SBIN0003607


*PHONE PAY:* 7799141459


🙏🙏🙏🙏🙏🙏🙏

*NATIONAL ACTIVE REPORTERS ASSOCIATION CENTRAL COMMITTEE..*

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.