కాకినాడ జిల్లా , పెద్దాపురం, సామాజిక స్పందన :
సిపిఎం అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం తీరనిలోటని సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జి అన్నారు. సిపిఎం పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో యాసలపు సూర్యారావు భవనంలో సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు అద్యక్షతన సీతారాం ఏచూరి సంస్మరణ సభ జరిగింది. సభ ప్రారంభం ముందుగా ఏచూరి చిత్రపటానికి దువ్వా శేషబాబ్జి, కరణం ప్రసాదరావు పూలమాల వేసారు.
విద్యార్ధి దశలోనే కమ్యూనిస్టుగా మారి ప్రజా ఉద్యమాలవైపు అడుగుపెట్టారన్నారు. అత్యంత చిన్నవయస్సులో కేంద్రకమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారని తరువాత పోలిట్‌బ్యూరోకు, సిపిఎం అఖిల భారత కార్యదర్శి స్దాయికి ఎదిగారన్నారు. పార్లమెంట్ సభ్యునిగా 2 సార్లు పనిచేసి ప్రజా సమస్యలను రాజకీయ ఎజెండా మీదకు తీసుకువచ్చారని అన్నారు. యుపిఎ ప్రభుత్వంలో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు అవసరమైన ఉపాదిహామీ, సమాచారహక్కుచట్టం, అటవీహక్కుల చట్టం తేవడంలో కృసి సల్పారన్నారు. అంతర్జాతీయ కమ్యూనిస్టులతో సంబందాలు కొనసాగిస్తూ ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి తోడ్పాటు అందించారన్నారు. అత్యున్నతమైన జెఎన్‌యు లో 3 సార్లు అధ్యక్షునిగా పనిచేయడమే కాకుండా నాటి ప్రధాని ఇందిరా గాందీని జెఎన్‌యు విసిగా రాజీనామ చేయాల్సిందే అని పట్టుబట్టారని తెలిపారు. లౌకిక వాదులను ఐక్యం చేయడంలో దేశంలో, రాజ్యాంగాన్ని కాపాడడంలో ఎనలేని కృషి చేసారన్నారు. ఇంత మహోన్నత వ్యక్తి మన జిల్లా వాడు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. సీతారాం ఏచూరి ఆశయాలను మనందరం ముందుకు తీసుకువెళ్ళాలని విజ్ఞప్తి చేసారు.
కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిరిపురపు శ్రీనివాస్, కేదారి నాగు, కరణం ప్రసాదరావు, డి. సత్యనారాయణ, బాలం శ్రీనివాస్, కరణం గోవిందు, డి.కృష్ణ, గడిగట్ల సత్తిబాబు, సిఐటియు నాయకులు డి.బేబి, నాగమణి, పద్మ, వరలక్ష్మీ, సావిత్రి, మరిడియ్య. తదితరులు పాల్గోన్నారు.
.jpg)









0 Comments