కాకినాడ జిల్లా పెద్దాపురం సామాజిక స్పందన
పెద్దాపురం పట్టణంలోని వర్జులవారి వీధిలో వేంచేసి ఉన్న భువనేశ్వరిపీఠం లో అక్టోబర్ 3 గురువారం నుండి అక్టోబర్ 12 శనివారం వరకూ జరగబోవు దేవినవరాత్రులను పురస్కరించుకుని మొదటి ప్రధాన ఘట్టమైన రాట ముహూర్తమును శనివారం ఉదయం 09.గం. 23 ని.లకు భువనేశ్వరి పీఠాధిపతులు చింతా గోపిశర్మ సిద్ధాంతి అద్వర్యంలో పెద్దాపురం పట్టణానికి చెందిన వేముల సత్య సాయి ప్రసాద్ శ్రీమతి అరుణ దంపతులచే ఘనంగా నిర్వహింప చేశారు. ఈ కార్యక్రమమును మొదటగా గణపతి పూజతో ప్రారంభించినారు. ఈ సందర్భంగా గోపిశర్మ సిద్ధాంతి మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా ఈ శ్రీ దేవి నవరాత్రుల మహోత్సవములు ఘనంగా నిర్వహించుచున్నామని తెలిపారు. ఈ నవరాత్రులలో ప్రతిరోజూ అమ్మవారికి అభిషేకము, సహస్రనామ కుంకుమ పూజాదికాలు, చండి పారాయణ హోమాధికాలు జరుగుతాయి అని తెలిపారు. ప్రత్యక్ష పరోక్ష పద్ధతుల్లో పూజలు, హోమములలో పాల్గొనదలచిన భక్తులు 9866193557, 8897554557 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు. అదేవిధంగా
దేవి మాల వేయుంచుకొనువారు ముందుగా సంప్రదించగలరని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...










0 Comments