కాకినాడ జిల్లా, పెద్దాపురం, సామాజిక స్పందన :
ఏలేరు వరద కారణంగా ముంపుకు గురై ఇల్లు కోల్పోయిన మర్లావ గ్రామంలోని 12 కుటుంబాలకు ఒకొక కుటుంబానికి 5000 చొప్పున పాండవ గిరి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో బాదిత కుటుంబాలకు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా మర్లావలో అందజేశారు.
పాండవ గిరి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వడ్డీ సత్యనారాయణ కార్యదర్శి యాసలపు మహేష్ మాట్లాడుతూ వరద బాధితుల కోసం తమ సంఘం సభ్యులు ప్రజల నుండి 60 వేల రూపాయలు వసూలు చేశామని అన్నారు.
శాసనసభ్యులు చినరాజప్ప మాట్లాడుతూ వరద బాధితుల కోసం మానవసేవే మాధవ సేవ తలచి పెయింటింగ్ వర్కర్లు ఈ సహకారానికి పూనుకోవడం చాలా సంతోషం అన్నారు. ఎవరికి ఆపద వచ్చినా స్పందించే గుణం ముందుగా అందరికీ ఉండాలని అండ్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇబ్బందులను తెలుసుకొని ఎవరైతే ముసుగుతారు వారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని అన్నారు.
మర్లావలో సర్పంచ్ రామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజ సూరిబాబు రాజు, ఎలిశెట్టి నాని, సిఐటియు మండల కార్యదర్శి డి. క్రాంత్ కుమార్, పాండవ గిరి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నీలం శ్రీను, వల్లపు సూరిబాబు, కోశాధికారి కరణ అప్పారావు, శెట్టి రాజు కంపర వీరబాబు, గడప రమణ గొల్ల భద్ర రావు, కునుపూడి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు...










0 Comments