కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం, అంటున్న సీఎం రేవంత్ రెడ్డి


తెలంగాణ , సామాజిక స్పందన

మూసీ పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం పనిచేసింది.. మూసీ పరివాహక ప్రాంతం ప్రజలను ఆదుకోవడం ఎలా అనేదానిపై దృష్టి సారించాం.. ప్రపంచంలో ఎక్కడ మేధావులు అవసరమైనా దేశం నుంచే ఎగుమతి చేస్తున్నాం.. కాంగ్రెస్ పార్టీ వల్లే ఇది సాధ్యమైంది.. దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ కారణం.. కంప్యూటర్‌తో ఉద్యోగాలు, ఆదాయాలు పెరిగాయి.. కాంగ్రెస్ విజన్‌తోనే దేశం ముందడుగు వేసింది.. అప్పటి ప్రధాని పీవీ సరళీకృత విధానాలతో ప్రపంచంలోని దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి.. నెహ్రూ, రాజీవ్, పీవీ.. ముగ్గురు ప్రధానుల వల్ల దేశం అభివృద్ధి బాటలో నడిచింది.


అభివృద్ధిని ఎవరో ఒకరు వ్యతిరేకిస్తూనే ఉంటారు.. అధికారం కోల్పోయిన వాళ్లు ప్రతిదీ అడ్డుకోవాలని చూస్తున్నారు.. అధికారులు, మంత్రుల ముసుగులో దోచుకున్న బందిపోటు దొంగలు వాళ్లు.. అలాంటి వాళ్లు మూసీని అడ్డుకుంటున్నారు.. యూట్యూబ్‌లతో అధికారం వస్తుందని అనుకుంటున్నారు.. కేసీఆర్‌, మీ నియోజకవర్గానికే వస్తా.. రచ్చబండ నిర్వహిద్దాం.. కొండపోచమ్మ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్‌ ఎక్కడికైనా సెక్యూరిటీ లేకుండా వస్తా.. ఇది మూసీ సుందరీకరణ కాదు, ప్రక్షాళన.


హైదరాబాద్‌: నగరం మధ్యలో నుంచి నది ప్రవహించే నగరం దేశంలోనే లేదు.. అలాంటి హైదరాబాద్‌ నగరం పాలకుల నిర్లక్ష్యంతో మురికి కూపంగా మారింది.. మూసీకి పునరుజ్జీవనం అందిస్తాం.. మూసీ విషయంలో చరిత్ర హీనులుగా మిగలకూడదని మంచి ప్రణాళికను రూపొందిస్తున్నాం.. నదీగర్భంలో నివసిస్తున్న వారిపై ఆరు నెలల నుంచి అధికారులు సర్వే చేశారు.. 1600 ఇళ్లు నదీగర్భంలో ఉన్నాయి. -సీఎం రేవంత్ రెడ్డి.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.