డాక్టర్ మల్లాది ప్రసాదరావు కు గద్దర్ జాతీయ సేవా పురస్కార్.

  


రెడ్డిగూడెం, కృష్ణాజిల్లా, సామాజిక స్పందన

మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మమత స్వచ్చంద సేవా సమితి అధ్యక్షులు కోరుకొండ జాన్ ఆద్వర్యంలో డిసెంబర్ 12న సామాజిక, స్వచ్ఛంద రంగాల్లో సమాజ సేవకు అంకితమై పనిచేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ ప్రజా యుద్ధ నౌక గద్దర్ జాతీయ సేవా పురస్కార అవార్డుల ప్రదానోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా పి.గన్నవరంలో సాయి తేజ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ మల్లాది ప్రసాదరావు సామాజిక ఉద్యమ నేతగా,జర్నలిస్ట్ గా మరియు భారత్ స్వచ్చంద సంస్థల ఐక్యవేదిక జాతీయ కార్యదర్శిగా, మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగా గ్రామీణ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సమాజ సేవకు అంకితమై ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ మల్లాది ప్రసాదరావు సేవలను గుర్తించి గద్దర్ జాతీయ సేవా పురస్కారం (సేవరంగం) 2024 ప్రజాయుద్ధనౌక గద్దర్ కుమార్తె తెలంగాణ సాంస్కృతిక రథసారథి డాక్టర్ గుమ్మడి వెన్నెల మరియు పి.గన్నవరం శాసనసభ్యులు గిట్టు సత్యనారాయణ చేతుల మీదుగా అందుకున్నారు.



 ఈ సందర్భంగా గద్దర్ జాతీయ సేవా పురస్కార అవార్డు అందుకున్న డాక్టర్ మల్లాది ప్రసాదరావు మాట్లాడుతూ సామాజిక కార్యకర్తగా, జర్నలిస్టుగా, మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులుగా నేను చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను గుర్తించి గద్దర్ జాతీయ సేవా పురస్కారం అందించిన మమత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కోరుకొండ జాన్ మరియు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.


గద్దర్ జాతీయ సేవా పురస్కార్ అందుకున్న మల్లాది ప్రసాదరావును జర్నలిస్ట్ సంఘాలు, పాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామ ప్రజలు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతూ హర్ష వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.