సామాజిక స్పందన, పెద్దాపురం, కాకినాడ జిల్లా
జనవరి 27వ తేదీ థామస్ అల్వ ఏడిసన్ జయంతి సందర్బంగా జరిగే ఎలక్ట్రికల్ డే జయప్రదం చేయాలని పెద్దాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్( సిఐటియు) పిలుపునిచ్చింది. యాసలపు సూర్యారావు భవన్ లో సంఘం అధ్యక్షులు తాడిశెట్టి గంగ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా యూనియన్ గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ వర్కర్స్ అందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. అందరూ కలసి మెలిసి నడవాలని పిలుపు నిచ్చారు. థామస్ ఆల్వా ఎడిసిన్ తను బల్బును కనిపెట్టడానికి అవసరమైన కృషి ఎంత చేసారో మనందరం తెలుసుకోవాలని అన్నారు. 27వ తేదీన జెండా ఆవిష్కరణ, ర్యాలీ జరుగుతాయని. ఎలక్ట్రికల్ వర్కర్స్ అందరు పాల్గొనాలని కోరారు.
సమావేశం లో పేదిరెడ్ల విష్ణు, కందికట్ల దుర్గ, భూసారి శ్రీను, షేక్ బాషా, ఇబ్రహీం, కాకి దుర్గ, శ్యామల దుర్గారావు, జోగా సూర్యనారాయణ, కొన్నాల రాజు, లంక చంటి, మదిని దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










0 Comments