పెద్దాపురం, కాకినాడ జిల్లా, సామాజిక స్పందన
వైద్య రంగంలో మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించి, శ్రీ ఆధిష్ హాస్పిటల్స్ ప్రముఖ వైద్యులు డా. సౌమ్య ఆధ్వర్యంలో ఆదిత్య నర్సింగ్ కళాశాల ఆవరణలో ది. 10-02-2025, సోమవారం ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్త్రీలలో సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, అవి తలెత్తే కారణాలు, నివారణ చర్యలు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు, ముందస్తు వైద్య పరీక్షల ప్రాముఖ్యత వంటి అంశాలపై డా. సౌమ్య వివరంగా తెలియజేశారు.
సదస్సుకు నర్సింగ్ విద్యార్థినులు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది, మరియు ఇతర ఆసక్తిగల మహిళలు హాజరై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. మహిళల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించడం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాల్సిన అవసరముందని డా. సౌమ్య తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డా సౌమ్య గారు తో పాటు కాలేజీ ప్రిన్సిపాల్ సెంథిల్ కుమార్ , గుమ్మళ్ళ శివ ప్రసాద్ మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.
.jpg)









0 Comments