దాడులు చేసిన వారి చిట్టాను పింకు బుక్‌లో రాసుకుంటాం: కవిత హెచ్చరిక.

 



తెలంగాణ, సామాజిక స్పందన

సమయం వచ్చినప్పుడు వారి సంగతి తేలుస్తామన్న కవిత. సింగోటం ఆలయానికి కేసీఆర్ రూ.17 కోట్లు మంజూరు చేశారన్న కవిత. నిధులను జూపల్లి కృష్ణారావు రద్దు చేశారని ఆరోపణ.

తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వారి చిట్టా పింకు బుక్‌లో రాసుకుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తమకు సమయం వచ్చినప్పుడు వారి సంగతిని తేలుస్తామని ఆమె హెచ్చరించారు. నేడు కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ, సింగోటం లింగాకార లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కోసం గతంలో కేసీఆర్ రూ.17 కోట్లు మంజూరు చేస్తే, ఆ నిధులను జూపల్లి కృష్ణారావు రద్దు చేయడం దారుణమని పేర్కొన్నారు.


ఒక ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలు తర్వాత ప్రభుత్వం కొనసాగించాలని అన్నారు. అప్పుడే ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ప్రజల మీద కక్ష కట్టినట్లుగా దేవుడిపై కూడా కక్ష కట్టి రూ.17 కోట్లను రద్దు చేయించడం విడ్డూరమని అన్నారు. ఈ రద్దు చేసిన నిధులను తక్షణమే ఆలయ అభివృద్ధి కోసం ఉపయోగించాలని డిమాండ్ చేశారు.


కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆమె అన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. జూపల్లి కృష్ణారావు టూరిజం మంత్రిగా కాకుండా, కొల్లాపూర్ నియోజకవర్గానికి అప్పుడప్పుడు వస్తూ 'టూరిస్ట్ మంత్రి'గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.