న్యూ ఢిల్లీ, సామాజిక స్పందన: వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 రాజ్యాంగబద్ధతపై ప్రశ్నించుతూ జమాఅతె ఇస్లామీ హింద్ (JIH) భారత సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ (మొహమ్మద్ సలీమ్ & ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా) ను JIH ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ సలీమ్ ఇంజినీర్, మౌలానా షఫీ మదనీ మరియు ఇనామ్ ఉర్ రెహ్మాన్ దాఖలు చేశారు. ఈ ముగ్గురూ జమాత్ యొక్క ప్రముఖ నాయకులుగా ఉన్నారు. వారు చట్టంలోని సవరణలు మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని, భారత్‌లో వక్ఫ్‌ల మతపరమైన, దాతృత్వ, సామాజిక స్వభావాన్ని ఖండిస్తున్నాయని తెలిపారు. ఈ సవరణలను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, అవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 16, 25, 26, 300Aలను ఉల్లంఘిస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.._
* *_పిటిషన్‌లో లేవనెత్తిన ప్రధాన ఆందోళనలు:_*
* *_1. మౌలిక హక్కుల ఉల్లంఘన:_*
* _వక్ఫ్ నిర్వచనాన్ని, నిర్మాణాన్ని మార్చి, వక్ఫ్ స్థాపన మరియు నిర్వహణపై అనవసర పరిమితులు విధించడాన్ని ఈ చట్టం నిర్దేశిస్తోంది. ఉదాహరణకు, వక్ఫ్ స్థాపించాలనుకునే వ్యక్తి గత ఐదేళ్లుగా ఇస్లాంను అనుసరిస్తున్నట్టు నిరూపించాలి అనే అర్థహీనమైన నిబంధన ప్రవేశపెట్టారు. ఇది మత స్వేచ్ఛను హరించడమే కాకుండా మహిళలు, కొత్తగా ఇస్లాం స్వీకరించినవారు వంటి వ్యక్తులను అప్రతక్షంగా తొలగించేందుకు దారి తీస్తుంది. ఇది ఆర్టికల్స్ 25 మరియు 15 ఉల్లంఘన.._
* *_2. వక్ఫ్ బోర్డుల స్వయంపాలన హక్కును లుంచడం:_*
* _ఇప్పటివరకు ఎన్నికైన వక్ఫ్ బోర్డులను రద్దు చేసి, ప్రభుత్వ నియామక అధికారులతో వాటిని భర్తీ చేయడమూ, ముస్లిం కాని వారిని కూడా ఇందులో చేర్చడమూ జరిగింది. ఇది ఆర్టికల్ 26లోని మత సంస్థల నిర్వహణపై సముదాయం కలిగిన హక్కును తీవ్రంగా ఉల్లంఘిస్తుంది. అంతేగాక, బోర్డు సీఈఓ ముస్లిం అయ్యే అవసరం లేదనే నిబంధన సముదాయ ప్రతినిధిత్వాన్ని కాలరాసే విధంగా ఉంది.._
* *_3. వక్ఫ్ ఆస్తుల అన్యాయ హక్కు హరణ:_*
* _సెక్షన్ 3D ద్వారా ASI (పురావస్తు విభాగం) రక్షిత స్మారక చిహ్నాలలో ఉన్న వక్ఫ్ ఆస్తులన్నింటినీ చట్టవిరుద్ధంగా శూన్యంగా ప్రకటించారు. ఇది వాస్తవానికి 1958 పురాతన స్మారక చట్టంలోని సెక్షన్ 6ను వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా, కబ్జాదారులు లిమిటేషన్ చట్టాన్ని వర్తింపజేసి వక్ఫ్ భూములపై హక్కు సాధించేందుకు చట్టానికి వ్యతిరేకంగా వెనక్కి వర్తించగలగడం వల్ల ముస్లిం దాతృత్వ ఆస్తుల ముప్పు పెరిగింది.._
* *_4. సమాజపు అభిప్రాయాన్ని విస్మరించడంః_*
* _ఈ చట్టం రూపొందించే ప్రక్రియలో సంబంధిత ముస్లిం సమాజపు అభిప్రాయాన్ని పూర్తిగా విస్మరించారు. పార్లమెంటు ప్రక్రియలను నిలిపివేసి, చివరి నిమిషాల్లో 3D, 3E సెక్షన్లు చేర్చడం జరిగింది. JIH నాయకులు పార్లమెంటరీ కమిటీ ఎదుట తమ అభ్యంతరాలను స్పష్టంగా వ్యక్తపరిచినా, వాటిని విస్మరించి చట్టాన్ని ఆమోదించారు. ఇది ప్రజాస్వామ్య ఆచారాలకు విరుద్ధం.._
* *_ఇతర చట్టపరమైన వాదనలు:_*
* _ఈ చట్టం "వాడుక ద్వారా వక్ఫ్" అనే న్యాయసిద్ధాంతాన్ని అమాన్యంగా తోసిపుచ్చుతుంది. ఇది రామ్ జన్మభూమి - బాబ్రీ మసీదు కేసు తదితర తీర్పుల్లో న్యాయస్థానాలు గుర్తించిన సిద్ధాంతం. అంతేగాక, రెవిన్యూ రికార్డులను అసలైన హక్కుగా పరిగణించడం వలన వాస్తవంలో వున్న వక్ఫ్ హక్కులను నిర్ధారించలేని పరిస్థితి. మత ఆస్తుల నిర్వచనం, స్వంతత్వం గురించి పలు తీర్పులు (లాల్ షాహ్ బాబా దర్గా, షేక్ యూసుఫ్ చావ్లా, రామ్‌జాస్ ఫౌండేషన్) సూచించినట్లు, వాడుక, చరిత్ర, సమాజ స్వీకరణ ఆధారంగా నిర్ణయించాలి.._
* *_జమాత్-ఎ-ఇస్లామీ హింద్ పిలుపు:_*
* వక్ఫ్ అనేది ఇస్లాం మత విశ్వాసంలో మరియు భారతీయ మతసామరస్య వారసత్వంలో కీలక భాగం. దీని మతపరమైన, దాతృత్వ మరియు సమాజ సేవా లక్షణాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం రాజ్యాంగ విరుద్ధమే కాదు, నైతికంగా కూడా అన్యాయం. జIH పౌర సమాజం, న్యాయ నిపుణులు మరియు న్యాయం కోసం పాటుపడే ప్రతి భారత పౌరుడిని ఈ చట్టవ్యతిరేక పోరాటంలో సంఘీభావం ప్రకటించమని కోరుతోంది.










0 Comments