ఎస్ డి వి ఎల్ స్కిల్ సెంటర్ నందు 20 రోజుల ఎమ్మెస్ ఎంఇ వర్క్ షాప్, అడ్వాన్స్ కోర్సులలో శిక్షణ


 కాకినాడ జిల్లా, సామాజిక స్పందన : 

స్థానిక ఎస్ డి వి ఎల్ స్కిల్ ఆఫ్ సెంటర్ నందు 20 రోజుల ఎమ్మెస్ అని వర్క్ షాప్ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మొత్తం 60 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది.


ఈ కార్యక్రమంలో పది రోజులపాటు ఎంటర్ప్రైన్షిప్ గురించి క్లాస్ చెప్పడం జరుగుతుంది అలాగే ఇంకొక పది రోజులు వెబ్ డెవలప్మెంట్ అడ్వాన్స్ అడ్వాన్స్ ఫైతాన్  కోర్సులలో టెక్నికల్ గా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.


ముఖ్యంగా యువతకు కావలసినటువంటి టెక్నికల్ స్కిల్స్ యొక్క వర్క్ షాప్స్ రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని అలాగే వారికి ప్రాక్టికల్స్ కూడా నిర్వహించడం జరుగుతుందని స్కిల్ హబ్ నిర్వాహకులు ప్రసాద్ గారు తెలియజేశారు. 


ప్రభుత్వము ఇటువంటి వర్క్ షాప్ లను యువతకు వారి ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి నిర్వహిస్తున్నదని యువత ఇటువంటి కార్యక్రమాలను వినియోగించుకొని ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని *ఎం.ఎస్.ఎం.ఈ సిఐటిడి డైరెక్టర్ విజయ కృష్ణ కాంత్* గారు తెలియజేశారు. 


అలాగే వర్క్ షాప్ అయిపోయిన తర్వాత వారికి ఉపాధి అవకాశాలు కూడా సెంటర్ ద్వారా కల్పించడం జరుగుతుందని జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ సిఐటిడి  డైరెక్టర్ వెంకటకృష్ణ గారు ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ డి వి ఎల్ సంస్థ అధినేత దుర్గాప్రసాద్ మరియు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. . 

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.