సామాజిక స్పందన: విజయవాడ
జాతీయ స్వచ్ఛంద సేవ సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ ఆంధ్రప్రదేశ్. 22 - 05 - 2022 తేదీ ఆదివారం ఉదయం 9 : 30 to 12 : 30 వరకు విజయవాడలో ప్రెస్ క్లబ్ నందు మీటింగ్ జరుగును ఈ కార్యక్రమనికి జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఉప్పునూతల నాగరాజగౌడ్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి మడుపు రాంప్రకాస్ గారు ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి , అంతర్జాతీయ గుర్తింపు పొందిన మనం ఫౌండేషన్ ఫౌండర్ & జాతీయ అధ్యక్షులు డాక్టర్ .కె.చక్రవర్తి లాయర్ గారు, వరల్డ్ రికార్డ్ పురస్కరలు అందుకున్న కవి ,రచయిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గంగా శ్రీ డాక్టర్ .రంగిశెట్టి రమేష్ గారు. NGO's రంగంలో అపార అనుభవం కలిగిన సీనియర్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రీ బి.దాసు గారు. మరియు తదితరులు పెద్దలు హాజరుకానున్నారు.
కావున AP NGO's JAC నూతనంగా ఏర్పాటు అవుతున్న శుభ సందర్భంగా సంస్థ లోగో ఆవిష్కరణ మరియు ఈ యొక్క కమిటీలో నియమితులైన గౌరవ ముఖ్య సలహాదారులు , గౌరవాధ్యక్షులు మరియు ఎపి స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్లు & కోఆర్డినేటర్లు మరియు జిల్లాలకు సంబoదించిన చీఫ్ కోఆర్డినేటర్లు మరియు కోఆర్డినేటర్లు . మరియు స్వచ్ఛంద సేవ సంస్థలు అందరం ఐక్యమత్యంతో కలసి ఈ కార్యక్రమనికి హాజరు కావాలని, సమాజంలో సమాజ శ్రేయస్సు కోసం హర్నిశలు అంకితభావంతో సమాజంలో ఉన్న ప్రతి నిరుపేదవారికి సేవలు అందింస్తున్న ప్రతి ఒక్కరూ హాజరువుతారుని మన సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యాలిని మిమ్ములను హృదయపూర్వకoగా ఆహ్వానిస్తున్నాం అంటూ ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ బి.అయ్యప్ప ఆంధ్రప్రదేశ్ సేవ స్వచ్ఛంద సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ కోఆర్డినేటర్ తెలియజేశారు..
@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@@
నేపాల్ లో విమానం మిస్సింగ్, అందులో నలుగురు భారతీయులు
సామాజిక స్పందన: న్యూఢిల్లీ
నేపాల్‌లో ఓ విమానం అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం తారా ఎయిర్‌కు చెందిన 9 NAET ట్విన్ ఇంజిన్ విమానం ఆచూకీ గల్లంతైంది. కాగా, ఈ విమానం పోఖారా నుంచి నేపాల్‌లోని జోమ్‌సోమ్‌కు వెళ్తుండగా ఉదయం 9.55 గంటలకు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయని అధికారులు ధృవీకరించారు. మరోవైపు.. జోమ్‌సోమ్‌లోని సమీపంలో ఉన్న దౌలత్‌గిరి పర్వతం వైపు విమానం మళ్లిన తర్వాతే ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్టు తెలుస్తోంది.
కాగా, తప్పిపోయిన విమానంలో ముగ్గురు విమాన సిబ్బందితో సహా 19 మంది ప్రయాణీకులు ఉండగా.. వారిలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపానీయులు ఉన్నట్టు సమాచారం. విమానం సిగ్నల్స్ కట్ అవడంతో గాలింపు చర్యల కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్టు తారా ఎయిర్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు.












0 Comments