సామాజిక స్పందన: ప్రత్యేక కథనం
ఆత్మీయుల సమక్షంలో బాజాభజంత్రీలు నడుమ వేద మంత్రాల సాక్షిగా క్షమా బిందు 'స్వీయ వివాహం' చేసుకొంది.సంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో అన్నీ ఉన్నాయి గానీ.. ఒక్క వరుడే లేడు. ముందుగానే అన్నట్లుగా తనను తానే పెళ్లి చేసుకున్న క్షమా.. ఒంటరి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
గుజరాత్‌లోని వడోదరకు చెందిన 24ఏళ్ల క్షమా బిందు తనను తానే పెళ్లాడతానని ప్రకటించి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇందుకు తొలుత గోత్రిలోని ఓ ఆలయంలో వివాహం చేసుకునేందుకు జూన్ 11న ముహూర్తం కూడా నిశ్చయమైంది. అయితే, ఆమె వివాహం వివాదాస్పదంగా మారింది. క్షమా తీరును తప్పుబట్టిన కొందరు రాజకీయ నేతలు ఆమె పెళ్లిని అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో అనుకున్న ముహూర్తం కంటే రెండు రోజుల ముందే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే క్షమా నేడు వివాహం చేసుకొంది.
ఇంతకీ ఎవరీ క్షమా బిందు?
గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు.. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.. ప్రస్తుతం ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్ రిక్రూట్‌మెంట్ అధికారిణిగా పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తండ్రి దక్షిణాఫ్రికాలో ఉంటుండగా.. తల్లి అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. తమ కూతురు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి వారికి కొంత సమయం పట్టినప్పటికీ చివరకు సరేనన్నారు. ఆఖరుకు ఈ వివాహం జరిపించేందుకు పూజారిని కూడా ఒప్పించారు. స్నేహితుల సమక్షంలో జరిగిన క్షమా పెళ్లికి వారు వీడియోకాల్ ద్వారా హాజరయ్యారు..
@@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@
డాక్టర్ ఆకుమల్ల శ్రీనివాసులు గారికి ఎన్టీఆర్ సేవరత్న పురస్కారం
సామాజిక స్పందన: తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు
తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రం కమిటీ హాల్ నందు జరిగిన సమావేశంలో చినుకు & లిటిల్ ఛామ్స్ అకాడమీ ఆఫ్ ఇండియా ,వారు నిర్వహించినా శ్రీ స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా సమాజంలో వివిధ రంగాల్లో వారి వృత్తి విశిష్ట ప్రావీణ్యం కలిగి సమాజంలో సేవ చేస్తున్న సమాజ సేవకులను గుర్తించి వారి సేవలను కొనియాడుతూ జాతీయ సేవ పురస్కారలు అందచేసారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వై యెస్ ఆర్ కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన డాక్టర్ .ఆకుమల్ల శ్రీనివాసులు గారికి వారు గత 30 ఇయర్స్ నుంచి సమాజంలో చేస్తున్న సేవలను గుర్తించి వారికి ఎన్టీఆర్ సేవరత్న పురస్కారంను ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిలుగా విచ్చేసిన గౌరవానియులు కొలకలూరి పౌండేషన్ అధ్యక్షులు శ్రీ కె.రవి బాబు గారు , గౌరవానియురాలు పి.వి.పి. అంజనీకుమారి మేడం గారు సుపరడెంట్ తెలంగాణ హైకోర్టు ,, సినీ టీవీ నటి స్వప్న గారు , లిటిల్ ఛామ్స్ అకాడమీ సేకరిట్రీ శ్రీ కె.బుచ్చేశ్వర్ గారు, చినుకు కల్చర్ సొసైటీ అధ్యక్షులు పి.ఎస్.మూర్తి గారు మరియు పలుగురు ప్రముఖుల చేతులమీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఆకుమల్ల శ్రీనివాసులు గారు మాట్లాడుతూ, ఎన్టీఆర్ మహానుభావుడు తెలుగు ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని దేశమంతటా చాటిచెప్పిన వ్యక్తి తెలుగు జాతి ముద్దుబిడ్డ అయినటువంటి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి ఎన్టీఆర్ సమాధి పై పుష్పగుచ్ఛం ఉంచి నమస్కారం చేసుకొన్న అనంతరం
జాతీయ ఎన్ టి ఆర్ సేవరత్న పురస్కరo ప్రముఖుల చేతులమీదుగా అందుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది నన్ను గుర్తించి ఈ అవార్డ్ కు ఎంపిక చేసిన లిటిల్ ఛామ్స్ అకాడమీ ఆఫ్ ఇండియా , సేకరిట్రీ శ్రీ కె.బుచ్చేశ్వర్ గారికి మరియు చినుకు కల్చర్ సొసైటీ అధ్యక్షులు పి.ఎస్.మూర్తి గారికి మరియు నా యొక్క సేవలను ఈ కార్యక్రమ నిర్వహికులకు తెలియచేసి ఈ అవార్డ్ రావడానికి కారుకాలైన మా తమ్ముడు మనం ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. చక్రవర్తి గారికి , హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు.












0 Comments