కర్నాటక ప్రమాదంలో మృతి చెందిన వారికి ఎక్స్ గ్రేషియా

 


 సామాజిక స్పందన: హైదరాబాద్

కర్నాటక ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని సిఎం ఆదేశించారు. మృతదేహాలను స్వస్థలానికి తరలింపునకు చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కర్నాటక నుంచి మృతదేహాలు తరలింపునకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్ సంగారెడ్డి కలెక్టర్ కు ఆదేశించారు.



పీఎంకిసాన్ లబ్ధిదారుల ఖాతాల్లొకి రూ.21వేల కొట్లు జమా చేయనున్నారు: నరేంద్ర మోదీ

సామాజిక స్పందన: సిమ్లా

పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 11 విడతనిధులను మోదీ సిమ్లా వేదికగా మంగళ వారం విడుదలచేయనున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 10 కొట్లు మందికి పైగా రైతుల ఖాతాల్లొ దాదాపురూ.21వేలకోట్లనిధులు(రూ.2వేలచొప్పున)జమకానున్నాయి.

పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈ-కేవైసీ గడువు పెంపు

పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈ కేవైసీ చేయించనేందుకు కేంద్రం మరింత గడువు పెంచింది. ఆధార్ ప్రామాణికరించబడిన డేటాతొ పిఎం కిసాన్ లబ్దిదారులందరికి ఈకేవైసీ ధ్రువీకరణ చేపట్టడానికి తొలుత ఈ ఏడాది మార్చి 31గా గడువును కేంద్రం నిర్దేశించింది. తర్వాత ఈ గడువును మే31 వరకు పొడిగించింది అయినా దేశవ్యాప్తంగా 11.22కొట్లు మంది లబ్ధిదారుల్లొ 50 శాతం లొపే ఈకేవైసి చేయించుకున్నారు దీంతో మిగిలిన వారి కొసం గడువును ఈ ఏడాది జూలై 31 వరకు ఈ గడువును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.