సామాజిక స్పందన: ఢిల్లీ
ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించారు.ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికలు, రాష్ట్ర రుణపరిమితిపైనా చర్చించినట్లుగా సమాచారం. పోలవరం ప్రాజెక్ట్ నిధులు విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు జగన్. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన నిధులను ఇప్పించాలని ప్రధానిని కోరారు జగన్.వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా జగన్ వెంట ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రధానితో జగన్ భేటీ.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కచ్చితంగా వైసీపీ ఎంపీల మద్దతు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోఈ అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం.
ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కోసం గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన జగన్… సాయంత్రం 4.30 గంటలకు మోదీతో సమావేశమయ్యారు. దాదాపుగా 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.










0 Comments