దిల్లీ, సామాజిక స్పందన :
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. 2026 జనాభా లెక్కలు వచ్చే వరకు వేచి ఉండాలని తేల్చి చెప్పింది.తెలంగాణ, ఏపీలో ప్రస్తుతమున్న శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెంపుపై భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై లిఖితపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి నిత్యానందరాయ్.. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు పెరగాలంటే.. రాజ్యాంగ సవరణ అవసరమని చెప్పారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీ స్థానాలు పెంచాలంటూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా అవి 153 వరకూ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం 175 స్థానాలు ఉండగా అవి 229 స్థానాల వరకూ పెరిగే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల ఆశలు నెరవేరాలంటే కేంద్రం చెప్పినట్టు 2026 వరకు ఆగాల్సిందే.











0 Comments